Asianet News TeluguAsianet News Telugu

Salaar: మరోసారి ప్రభాస్ కి సాయం చేయనున్న రాజమౌళి.. సలార్ కోసం ఏం చేయబోతున్నారంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. 

Rajamouli to interview prabhas and prashanth neel for Salaar movie dtr
Author
First Published Dec 13, 2023, 4:43 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.  దీనితో ఇటీవల సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ లో చాలా గ్రాండ్ గా కనిపించింది. అయితే ఎక్కువగా కేజీఎఫ్ ఛాయలు ఉండడం, ప్రభాస్ పాత్రని ఆశించిన స్థాయిలో హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. సలార్ ట్రైలర్ పూర్తి స్థాయిలో కిక్కు ఇవ్వలేదు అనేది వాస్తవం. 

దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు కూడా నత్త నడకగా సాగుతున్నాయి. ఎందుకు సలార్ టీమ్ సైలెంట్ గా ఉందో ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. ఇంతవరకు సింగిల్ ఇంటర్వ్యూలు కూడా రాలేదు. చిత్ర యూనిట్ మీడియా ముందుకు రాలేదు. సలార్ చిత్రానికి భారీ హైప్ ఉన్న మాట వాస్తవమే. అలాగని చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉంటే ఓపెనింగ్స్ పై ఎంతోకొంత ప్రభావం ఉంటుందని అంటున్నారు. 

Rajamouli to interview prabhas and prashanth neel for Salaar movie dtr

ఈ తరుణంలో ఫ్యాన్స్ లో హుషారు తెప్పించే వార్త ఒకటి వచ్చింది. ప్రభాస్ సలార్ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి భాగం కాబోతున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లని రాజమౌళి ఇంటర్వ్యూలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఇంటర్వ్యూ షూట్ కానుందట.  

గతంలో రాజమౌళి రాధేశ్యామ్ చిత్రం కోసం ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశారు. రాజమౌళికి ఇష్టమైన హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. బాహుబలి రెండు భాగాలతో పాటు ఛత్రపతి చిత్రం కూడా వీరి కాంబినేషన్ లోనే వచ్చింది. ఈ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సలార్ రెండో ట్రైలర్ కూడా రెడీ అవుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios