బాహుబలి సినిమాకు రాజమౌళికి కోట్ల రూపాయలు పారితోషికం హైదరాబాద్ పరిసరాల్లో వంద ఎకరాల ఫామ్ హౌజ్ నిర్మాణానికి ప్లాన్ బాహుబలిని మించిన అద్బుత దృశ్య కావ్యాలకు ఫామ్ హౌజ్ పునాది వేయాలి
'బాహుబలి' సినిమా కోసం కొన్నేళ్ల నుంచి విశ్రాంతి లేకుండా పని చేసిన దర్శకధీరుడు రాజమౌళి... తన తదుపరి సినిమాను ఫిక్స్ చేసుకోవడానికి ముందు కొంతకాలం రిలాక్స్ అవ్వాలని డిసైడయ్యారు... ఇందుకోసం ఆయన తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలు చేస్తున్నారు... అంతే కాదు ఇకపై షూటింగ్ గ్యాప్ లో విశ్రాంతి తీసుకునేందుకు ఓ ఫామ్ హౌస్ ను నిర్మించుకునే పనిలో ఉన్నాడట జక్కన్న. బాహుబలి సాధించిన కలెక్షన్స్ తో భారీ ప్యాకేజీతోపాటు వాటాలు సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు ఓ మాంచి ఫామ్ హౌజ్ ఏర్పాటు పనుల్లో చేస్తున్నాడట.
హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో రాజమౌళి ఆల్రెడీ వంద ఎకరాల భూమిని కొన్నారని సమాచారం... ఇండస్ట్రీలోని చాలామంది సినీ ప్రముఖులకు సొంతంగా ఫామ్ హౌస్ లు ఉండటం... ఎక్కువ మంది వాటిని రిలాక్స్ అయ్యేందుకు ప్రిఫర్ చేస్తున్నారు. అయితే తాను కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌లో అన్ని రకాల మొక్కలను పెంచడంతో పాటు కొంతభాగంలో వ్యవసాయం కూడా చేయాలని దర్శకధీరుడు ఆలోచిస్తున్నాడట.
రాజమౌళి ఫ్యామిలీ కూడా పెద్దది కావడంతో... వాళ్లందరికీ ఈ ఫామ్ హౌస్ మంచి వెకేషన్ కానుంది. అయితే ఆయన కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌లో ఆయన అనుకున్న మార్పులు చేయడానికి కొంత టైమ్ పడుతుందట.. సినిమా కోసం కార్మికుడిలా కష్టపడే రాజమౌళి... తన ఫామ్ హౌజ్ లో ఎలాంటి ఆలోచనలకు పదును పెడతాడో, ఎన్నెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. అయితే ఇదంతా వట్టిదేనని ప్రచారం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఫామ్ హౌజ్ ఏర్పడి బాహుబలిని మించిన అద్భుత దృశ్య కావ్యాలకు ఆలోచనల పునాదులు వేయాలని ఆశిద్దాం.
