‘బాహుబలి’ సినిమాల తర్వాత  రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు.  


కొన్ని పరిస్దితులు ఊహించిరావు. ఎంత ఆలోచించి ప్లాన్ చేసినా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా కోట్లతో బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆ సమస్యలు మరీ ఎక్కువ ఉంటాయి. కోవిడ్ అలాంటి సమస్య చాలా ఇండస్ట్రీలకు తెచ్చిపెట్టింది. సినీ పరిశ్రమను అయితే అల్లకల్లోలం చేసేసింది. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ చాలా డిస్ట్రబ్ అయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరోసారి వాయిదా పడింది. ఒమిక్రాన్‌, కరోనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేసారు. 

ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంకో ఆరు రోజుల్లో సినిమాని చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది. కొత్త ఏడాది తొలి రోజే తప్పని పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్రటీమ్. ఈ ఇంపాక్ట్ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ పై బాగా పడింది. 

ఈ మూవీ కేవలం భారత దేశంలోనే కాకుండా.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ టికెట్స్ రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూఎస్‌లో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్క్రీన్స్‌లోనూ ఆర్ఆర్ఆరే రిలీజ్ కు రెడీ అయ్యింది. తెలుగు తర్వాత హిందీలో ఏకంగా 793 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత తమిళం-291, మలయాళం-66, కన్నడ-62 థియేటర్లలో విడుదల కానుంది. ఇలా ఐదు భాషల్లో కలిపి మొత్తం 2,212 థియేటర్లలో భారీ స్థాయిలో ఈ మూవీ సందడి చేయనుంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా రిలీజ్‌కు రెండు వారాల మునుపే యూఎస్‌లో ప్రీ బుక్సింగ్స్ ప్రారంభించారు మూవీ మేకర్స్. అప్పటికే టెక్కెట్లన్నీ అమ్ముడుపోవడంతో దాదాపు రెండు మిలియన్ డాలర్లు( మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లు) వచ్చినట్టు తెలిసింది. 

అమెరికాలోని సీని మార్క్‌లో 5 లక్షల డాలర్లు, రీగల్‌లో లక్షన్నర డాలర్లు, ఇమాజిన్‌లో 3 లక్షల డాలర్ల వసూళ్లను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సినిమా. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అమెరికాలో ఇది సరికొత్త రికార్డు. అయితే ఇప్పుడా పరిస్దితి కొత్త రిలీజ్ డేట్ కు వస్తుందో లేదో అని కంగారుపడుతున్నారు. 

తాజాగా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపింది. దాంతో మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఒక పెద్ద ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ రేంజ్ లో అమెరికాలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాంతో యుఎస్ లో మళ్లీ ఊపు వస్తుందని ప్లాన్ చేస్తున్నారు.

‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు.