ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సామెతకు ఉదహారణ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. సామాన్యుడిలా ఉండే జక్కన్న సింపుల్సిటీ బాలీవుడ్ ను సైతా ఆకర్షించింది. ఇక మరోసారి తాను సామాన్యుడినే అని నిరూపించుకున్నారు ట్రిపుల్ ఆర్ డైరెక్టర్.   

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సామెతకు ఉదహారణ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. సామాన్యుడిలా ఉండే జక్కన్న సింపుల్సిటీ బాలీవుడ్ ను సైతా ఆకర్షించింది. ఇక మరోసారి తాను సామాన్యుడినే అని నిరూపించుకున్నారు ట్రిపుల్ ఆర్ డైరెక్టర్.

సినిమా వాళ్లు అంటే పెద్ద పెద్ద ఇళ్లు, కార్లు, హోదాతో ఏసీ నుంచి బయటకు రాకుండా దర్జాగా బ్రతుకుతుంటారు. సాధారణ వ్యక్తుల్లా ఉండాలి అన్నా ఉండలేరు. మనలా బయట తిరగాలన్నా తిరగలేని పరిస్థితి వాళ్ళది సెలబ్రిటీలది. కాని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టు స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం సామాన్యుడిలా ప్రవర్తిస్తుంటారు. ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా.. సింపుల్ గా ఉంటారు. ఆయన సింపుల్ సిటీకి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ విషయాన్నే మరోసారి నిరూపించారు జక్కన్న. 

దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌ చార్మినార్‌లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్‌ నైట్‌ బజార్‌ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. అక్కడ ఉన్నవారు ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ ను చూసి దిల్ ఖుష్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ అయ్యిండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇక రంజాన్‌ నెల కావడంతో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌లో షాపింగ్‌ హడావిడి కొనసాగుతూనే ఉంటుంది. ఈ హడావిడి చూడటానికి, షాపింగ్ చేయడానికి చాలా మంది చార్మినార్ వస్తుంటారు. ఇక ఛార్మినారు చూడాలి అనుకున్న దర్శకదీరుడు అనుకున్నదే తడవుగా అక్కడికి వెళ్ళి కాలినడకన చార్మినార్ లో సందడి చేశారు. 

ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను దాటి పరుగులు తీస్తోంది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది సినిమా. ఇక నెక్ట్స్ రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.