టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సౌత్ లో క్రేజ్ ఏ స్థాయిలో అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా తారక్ తెలిసిన వ్యక్తే .. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ స్టార్ హీరో సినిమాలు అక్కడ ఎలాంటి ఆదరణ అందుకోలేదు. ప్రస్తుతం రాజమౌళి చేస్తోన్న RRR సినిమాను బాలీవుడ్ లో కూడా వదలాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.  

బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా అని షూటింగ్ మొదలవ్వకముందే చెప్పేశాడు. అయితే సినిమాకు సంబందించిన రూమర్స్ ఎన్ని వస్తున్నా జక్కన్న చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వడం లేదు. ఆ విషయం పక్కనపెడితే రామ్ చరణ్ బాలీవుడ్ లో ఆల్ రెడీ జంజీర్ రీమేక్ తో పరిచయం అయ్యాడు'. కానీ అనుకున్నంతగా గుర్తింపు అందుకోలేదు. 

కానీ చరణ్ కి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే ఇప్పుడు జక్కన్న దగ్గర ఉన్న మొదటి పని బాలీవుడ్ కి జూనియర్ ని పరిచయం చేయడం. అందుకు సంబందించిన పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరోజు సినిమాకు సంబందించిన పోస్టర్ ని గాని అఫీషియల్ టైటిల్ ను గాని విడుదల చేసి నార్త్ మీడియా ముందు తారక్ ను ఉంచాలని జక్కన్న ప్లాన్.

అక్కడ మీడియాకు రాజమౌళి అంటే చాలా గౌరవం. అండ్ ఆయన సినిమాలకు సంబందించిన వార్త టాలీవుడ్ లో ఎక్కడ వినిపించినా వెంటనే అందుకుంటారు. ఇక ప్రస్తుతం తారక్ స్టామినా అక్కడ కూడా కనిపించాలని జక్కన్న చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.