ఎన్టీఆర్, చరణ్ లను ఒప్పించేందుకు రాజమౌళి స్కెచ్ ఏంటో తెలుసా..

First Published 6, Apr 2018, 3:00 PM IST
rajamouli sketch  to take consent of ntr ramcharan
Highlights
ఎన్టీఆర్, చరణ్ లను ఒప్పించేందుకు రాజమౌళి స్కెచ్ ఏంటో తెలుసా..

బాహుబలితో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన జక్కన్న రాజమౌళి తదుపరి సినిమాపై క్రేజ్ వుండటం సహజం. అయితే తన తదుపరి ప్రాజెక్టు కోసం ఇద్దరు హేమాహేమీలను ఒప్పించి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు జక్కన్న. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరినీ.. క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లో భాగస్వామ్యం చేశాడు రాజ‌మౌళి.

 

రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌థానాయ‌లుగా రూపొందుతున్న చిత్ర‌ కోసం మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ లు అంటే ద‌ర్శ‌క ధీరుడు తెరకెక్కించే చిత్రం కోసం ఒక‌రు మెగా ఇంటి నుంచి, మ‌రొక‌రు నంద‌మూరి వంశం నుంచి వ‌చ్చిన‌వాళ్లు. రాజమౌళి అంటేనే ఊహకు అందని మేజిక్ చేసే దర్శకుడు. అందుకే టాలీవుడ్ కు సంబంధించి ఎవ్వరూ ఊహించలేని, క‌నీవినీ ఎరుగ‌ని కాంబినేషన్ సెట్ చేశాడు. 

 

అసలు జక్కన్న దగ్గరున్న ఆ కథేంటో కానీ ఇద్దరు ఉద్ధండులను ఒప్పించటం ఎలా సాధ్యమైంది.. సన్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. ఓసారి రామ్‌చ‌ర‌ణ్‌ని త‌న ఆఫీసుకు పిలిచాడ‌ట రాజ‌మౌళి. ”నీ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నా.. ఇందులో ఇంకో హీరో కూడా ఉన్నారు.. అదెవ‌రో త‌ర‌వాత చెబుతా” అంటూ.. పంపించేశాడ‌ట‌. మ‌రోసారి ఎన్టీఆర్‌కి పిలుపు అందింది. ‘నీ కోసం ఓ క‌థ రాశా.. ఇందులో ఇంకో హీరో ఉన్నాడు’ అంటూ చ‌రణ్‌కి వేసిన క్యాసెట్టే ఎన్టీఆర్‌కీ వేశాడ‌ట రాజ‌మౌళి. ఈసారి ఇద్ద‌రినీ త‌న ఆఫీసుకు పిలిపించి.. ”నా క‌థ‌లో మీరిద్ద‌రే హీరోలు” అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడ‌ట‌. ఎన్టీఆర్‌ని చూసేంత వ‌ర‌కూ చ‌ర‌ణ్‌కీ, చ‌ర‌ణ్‌ని చూసేంత వ‌ర‌కూ ఎన్టీఆర్‌కీ మ‌రో హీరో ఎవ‌రన్న‌ది తెలీద‌ట‌. ఆ క్ష‌ణంలో ‘నో’ చెప్పే ఛాన్సే లేదు. కాబ‌ట్టి.. ‘ఎస్‌’ అనేశారు. అప్పుడే తీసిన ఫొటోనే సోషల్ మీడియాలో వదిలింది.వైరల్ అయింది.
ఆ ఫొటో తోనే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అనే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

కొన్ని రోజుల క్రితం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటూ మూవీకి సంబంధించిన ఓ లోగో డిజైన్ చేసి టీజ‌ర్ వ‌దిలారు. ఇలా ఓ టీజ‌ర్ వ‌స్తుంద‌న్న సంగ‌తి చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు కూడా తెలీద‌ట‌. ఆఖ‌రికి చిత్ర నిర్మాత డివివి దాన‌య్య‌కూ ఈ సంగ‌తి తెలీద‌ట‌. రాజ‌మౌళి మ‌న‌సులో రెండు మూడు లైన్లు ఉన్నాయ‌ని, అవి చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు చూచాయిగా తెలుస‌ని, ఈసారి రాజ‌మౌళి వీరిద్ద‌రినీ పిలిపించి క‌థ వినిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మళ్లీ వీళ్లు క‌ల‌సిన ఎప్పుడు బైటికి వస్తుందో చూడాలి.

loader