ఐదేళ్ల పాటు రిజల్ట్ ఏమవుతుందో తెలియకుండా ఒక సినిమా కోసంపని చేయడం పిచ్చితనమని, రాజమౌళి లాంటి పిచ్చోళ్లు ఉంటారని.. కొందరు పిచ్చోళ్లు ఆయన్ని నమ్ముతారని షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రభాస్.
ఐదేళ్ల పాటు రిజల్ట్ ఏమవుతుందో తెలియకుండా ఒక సినిమా కోసంపని చేయడం పిచ్చితనమని, రాజమౌళి లాంటి పిచ్చోళ్లు ఉంటారని.. కొందరు పిచ్చోళ్లు ఆయన్ని నమ్ముతారని షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రభాస్.
తను నటించిన 'బాహుబలి' సినిమా కోసం ఐదేళ్ల పాటు రాజమౌళికి డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. అసలు ఏ నమ్మకంతో అంతటి సాహసం చేశారనే విషయం ప్రస్తావించగా ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్క సినిమాకు ఐదు సంవత్సరాలు కేటాయించలేం. అలా కేటాయిస్తే మూడు నుండి నాలుగు సినిమాలకే నటీనటులు ముసలివాళ్లు అయిపోతారు. ఏదో సాధించాలనే తపన ఉన్న రాజమౌళి లాంటి పిచ్చోళ్లు కొందరుంటారు. కొందరు పిచ్చోళ్లు ఆయన్ను నమ్ముతారు. నిజంగా అదొక పిచ్చి, వెర్రితనమనే చెప్పాలి. కానీ బాహుబలి సినిమా విషయంలో ఆ పిచ్చితనమే పని చేసింది.
అయితే అన్ని సార్లు అది పని చేస్తుందని చెప్పలేం. నాలుగేళ్ల కెరీర్ నిఒక డైరెక్టర్ ని నమ్మి చేతిలో పెట్టడం కరెక్ట్ అని నేను చెప్పను. దర్శకులు, నిర్మాతలు చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో పని చేస్తారు. కానీ హీరో, హీరోయిన్లు అలా కాదు. కొంత కాలం తరువాత వేరే రోల్స్ చేయాల్సివుంటుంది. కాబట్టి ఒక సినిమా కోసం అన్నేళ్లు పని చేయడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు.
