తన యాక్టింగ్‌తోనే టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగారు. కానీ ఆయనపై దర్శకధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మెగాస్టార్‌ చిరంజీవి అంటే నటనకు మారుపేరు. అద్బుతమైన నటుడిగా ఆయనకు పేరుంది. అన్ని రకాల హవభావాలు పలికించడంలో ఆయనకు ఆయనే సాటి అనే ముద్ర ఉంది. తన యాక్టింగ్‌తోనే టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగారు. కానీ ఆయనపై దర్శకధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా చూస్తే నటనలో రామ్‌చరణ్‌ తర్వాతే అని చిరంజీవి అని చెప్పి పెద్ద షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు జక్కన్న కామెంట్ సంచలనంగా మారింది. 

 చిరంజీవి హీరోగా నటించిన మూవీ `ఆచార్య`. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటించిన చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్‌, చరణ్‌కి జంటగా పూజా హెగ్డే నటించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్‌లో `ఆచార్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో గెస్ట్ గా పాల్గొన్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

చిరంజీవి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఆయన ఇలా నేలపై ఇంత హంబుల్‌గా నిల్చొవడం కూడా ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు రాజమౌళి. చిరంజీవి ఎంత మెగాస్టార్‌ అయినప్పటికీ నటుడిగా ఇతర నటులతో కంపీటేటివ్‌గా ఫీలవుతుంటారు. సెట్‌లో చరణ్‌ ఉన్నా ఆయన అలానే ఫీలవుతుంటారు. ఆయన అలా చేయడం చాలా సరదాగా అనిపిస్తుంటుంది. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. అయితే అభిమానిగా చిరంజీవి నటన అంటే ఇష్టం. కానీ దర్శకుడిగా మాత్రం రామ్‌చరణ్‌ మీ కంటే బెటర్‌ అని చెబుతానని తెలిపి షాకిచ్చాడు రాజమౌళి. 

ఇంకా ఆయన చెబుతూ, `ఆచార్య` కోసం వేసిన ధర్మస్థలి సెట్‌ అద్భుతంగా ఉందని, దాని గురించి అంతా చర్చించుకుంటున్నారని, ఆ సెట్‌ని తర్వాత తాను కూడా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. చిరంజీవి, మణిశర్మ లది హిట్‌ కాంబినేషన్‌ అని, `ఆచార్య`లో మరోసారి రిపీట్‌ అయ్యిందని, ఇందులో `లాహే లాహే`, `భలే బంజారా` పాటలు అద్భుతంగా ఉన్నాయని, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందని చెప్పారు జక్కన్న. 

రామ్‌చరణ్‌ గురించి చెబుతూ, `ఆర్‌ఆర్‌ఆర్‌` కారణంగా గత మూడు నెలలుగా ఆయన గురించి మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. `మగధీర` టైమ్‌లో చిరంజీవికి కథని వినిపించానని, చరణ్‌కి సంబంధించి చిరంజీవినే అన్ని చూసుకుంటారని అప్పుడు అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసిందేంటంటే, చరణ్‌ తన కథలను తానే వింటాను, తనే ఓకే చేస్తాడు. ఎలా చేయాలనేది కూడా తన సొంత నిర్ణయమే, ఇందులో చిరంజీవి ఏమాత్రం జోక్యం చేసుకోరు, ఎలాంటి సలహాలివ్వరు. ఎలా చేయాలనేది కూడా ఆయన చెప్పారు. చరణే తన తప్పులు తెలుసుకుని మంచి నటుడిగా ఎదిగారని కొనియాడారు. మున్ముందు చరణ్‌ మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని, చిరంజీవి అంతటి స్థాయికి చేరాలని తెలిపారు. 

దర్శకుడు కొరటాల శివ గురించి రాజమౌళి మాట్లాడుతూ, ఆయన సైలెంట్‌గా ఉంటారుగానీ, చాలా గమనిస్తుంటారు. `మిర్చి` సినిమా టైమ్‌లో అద్భుతమైన మాస్‌ కమర్షియల్‌ సినిమా చేసి హిట్‌ కొట్టారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌ మార్చి సమాజానికి ఏదో చెప్పాలని, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్‌`, `భరత్‌ అనే నేను` వంటి సందేశాత్మక చిత్రాలు తీశారు. మంచి పేరుతెచ్చుకున్నారు. సినిమాలు బాగా ఆడాయి. కానీ ఎక్కడో మాస్‌ ఎలిమెంట్స్ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలిగింది. కానీ ఆయనలో ఉన్నంత మాస్‌ ఎలిమెంట్స్ చాలా దర్శకుల్లో చూడం. ఆయనొక బిగ్గెస్ట్ మాస్‌ డైరెక్టర్‌. ఆ మాస్‌ ఫీల్‌ `ఆచార్య`తో ఇవ్వబోతున్నారు. `ఆచార్య` డబుల్‌ బ్లాక్‌బస్టర్‌ కాబోతుందని చెప్పారు రాజమౌళి. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన అకేషన్‌ని పురస్కరించుకుని ఈ సందర్భంగా రాజమౌళిని ప్రత్యేకంగా సత్కరించారు చిరంజీవి.