Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌భాస్ బ‌ద్ధ‌కంపై రాజమౌళి,గెస్ట్ హౌస్ లో పార్టీ గురించి కూడా

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు కరణ్ జోహార్..., బాహుబలి టీమ్ ప్రభాస్, రానా, రాజమౌళిని తన పాపులర్ షో కాఫీ విత్ కరణ్ కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Rajamouli Reveals About Prabhas lazyness
Author
Hyderabad, First Published Dec 24, 2018, 9:01 AM IST

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు కరణ్ జోహార్..., బాహుబలి టీమ్ ప్రభాస్, రానా, రాజమౌళిని తన పాపులర్ షో కాఫీ విత్ కరణ్ కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.   కరణ్ ఆహ్వానాన్ని అందుకున్న రాజమౌళి సానుకూలంగా స్పందించి ఈ షోలో పాల్గొన్నారు.  ఆదివారం సాయంత్రం కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ప్రభాస్ కు చెందిన అనేక  టాప్ సీక్రెట్‌ని రాజమౌళి రివీల్ చేశారు. 

అందులో ముఖ్యంగా ప్ర‌భాస్ బ‌ద్ధ‌కిష్టినా.. బాగా తింటాడా? అని అడిగితే అవున‌నే అన్నారు రాజ‌మౌళి, రానా. ప్ర‌భాస్‌ బద్దకం గురించి మాట్లాడుతూ... ప్రభాస్ కి మామూలుగానే బ‌ద్ధ‌కం ఎక్కువ‌. షూటింగ్‌లో షాట్ కోసం ఎంతో అలెర్టుగా ఉంటాడు. ప‌నైపోగానే తిరిగి కూల్‌గా కూచుంటాడు. తిండి  కూడా ఎక్కువే తింటాడు.. అని రాజ‌మౌళి చెప్పాడు. పనిలో పనిగా రానా సైతం ప్ర‌భాస్ బ‌ద్ధ‌కం పై జోకులేశాడు. ఫైనల్ గా  త‌నకు అలా బద్దకంగా  ఉండ‌డ‌మే ఇష్ట‌మ‌ని ప్ర‌భాస్ అన్నాడు.

అంతేకాకుండా  ప్ర‌భాస్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతూ.. అక్క‌డ తిండి కి సంబంధించిన పార్టీలు ఎక్కువ సాగుతుంటాయ‌ని చెప్పాడు రాజ‌మౌళి. ఓసారి తాను ఫామ్ హౌస్‌కి వెళితే.. అక్క‌డ ప్ర‌భాస్ ఇచ్చిన  విందు అదిరిపోయిందని తెలిపాడు. ఇంకా ప్ర‌భాస్ బ‌య‌టికి ఎక్స్‌ప్రెస్సివ్ కాదు. ఇంట్రావ‌ర్ట్‌గా ఉంటాడ‌ని, అలాగ‌ని మ‌రీ అంత అమాయ‌కుడేం కాద‌ని, రానా కంటే అల్ల‌రి వాడు, చిలిపి అని రాజ‌మౌళి  అని చెప్పారు. అలా మొత్తానికి ప్ర‌భాస్ సీక్రెట్స్  మొత్తం బ‌య‌ట‌కు చెప్పేశారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios