పాన్ ఇండియా అనే పదానికిఅసలైన అర్ధాన్ని చెప్పిన తెలుగు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పెద్దన్న పాత్ర వహించినప్పటికీ ఎక్కువగా అన్ని భాషల్లో సినిమాను ఎలివేట్ చేయలేకపోతోంది. కానీ జక్కన్న మాత్రం బాహుబలితో ఒక కొత్త దారిని సృష్టించాడు. 

అయితే చిన్న చిన్న చిత్రాలకే అనవసరమైన కాంట్రవర్సీలు ఎదురైనప్పుడు ఇప్పుడు కొమురం భీమ్ - అల్లూరి సీతారామ రాజు వంటి చరిత్ర పాత్రలను తీసుకుంటే వివాదాలు రావా? అనే ప్రశ్న నిన్న ప్రెస్ మీట్ లో చాలా మందికి వచ్చింది. ఏ సంబంధం లేని కల్పిత కథ బాహుబలికె వివాదాలు రేగాయి. ఇక ఈ సినిమాకు కూడా రాకుండా ఉంటుందా? అని జక్కన్న మాట్లాడుతుంటే భవిష్యత్తులో రాబోయే కాంట్రవర్సీలకు అడ్వాన్స్ గా కౌంటర్ దెబ్బ ఇచ్చాడని చెప్పవచ్చు. 

ఎందుకంటే రాజమౌళి మీటింగ్ లో మాట్లాడిన ఒక చిన్న క్లిప్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తెరపై అద్భుతంగా కనిపించాలని హీరోలనే ఒక రేంజ్ లో చూపిస్తాను.. ఇక దేశం కోసం పోరాడిన నిజమైన హీరోలను ఇంకా ఏ రేంజ్ లో చుపిస్తానో మీరే ఉహించుకోండని భవిష్యత్తుకు ఒక సవాల్ ముందే విసిరాడని చెప్పవచ్చు. 

ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ప్రస్తుతం పాతుకుపోయాయి. అంత పెద్ద హీరోలను ప్పెట్టి జక్కన్న కొమురం భీమ్.. అల్లూరి సీతారామరాజు వంటి యోధులను తప్పుగా చూపిస్తాడు అని రానున్న కాలంలో ఎవరైనా అంటే..వారికి జక్కన్న చెప్పిన ఈ డైలాగ్ సరిపోతుందని అభిమానులు ఆ మాటలను తెగ షేర్ చేసుకుంటున్నారు.