ఆర్ ఆర్ ఆర్ టీం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో పాల్గొననున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మక అవార్డ్స్ కి నామినేటైన నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రాజమౌళి హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు.
ఆర్ ఆర్ ఆర్(RRR Movie) జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ గౌరవాలు ఆర్ ఆర్ ఆర్ అందుకుంది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు సాధించారు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఆర్ ఆర్ ఆర్ నామినేట్ అయ్యింది. ఉత్తమ నాన్ ఇంగ్లీష్ మూవీ, ఒరిజినల్ సాంగ్ నాటు నాటు విభాగాల్లో నామినేట్ అయ్యింది. అలాగే సాహిత్యం అందించిన చంద్రబోస్ కూడా నామినేషన్స్ లో చోటు సంపాదించారు.
లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొననున్నారు. దీని కోసం ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ టీంతో ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్ కేటీ వాల్ష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కేటీ వాల్ష్ లాస్ ఏంజెల్స్ టైమ్స్ తో పాటు కొన్ని మీడియా సంస్థలకు ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రతినిధిగా పని చేస్తున్నారు.
ఆమె ఆధ్వర్యంలోని హాలీవుడ్ మీడియా ఎన్టీఆర్(NTR), రాజమౌళిలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా... నాటు నాటు సాంగ్ కోసం రాజమౌళి 65 రాత్రులు టార్చర్ చేశాడండూ చెప్పుకొచ్చారు. నాటు నాటు సాంగ్ ని 12 రోజులు షూట్ చేశాము. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. నాటు నాటు సాంగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ వెల్లడించారు.
ఈ వేదికపై రాజమౌళి(Rajamouli) ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన నా అన్ని చిత్రాలలో ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పాలి. ఇంత వరకు నేను అంత మంచి సన్నివేశాలు డైరెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఒక కంటి నొస మీద కెమెరా పెడితే... ఆ ఒక్క కంటి నొసతో యాక్టింగ్ చేయగలడు. ఎన్టీఆర్ అంత టాలెంటెడ్ అంటూ రాజమౌళి ఆకాశానికి ఎత్తాడు.
ఈ ప్రెస్ మీట్ కి రామ్ చరణ్(Ram Charan) మిస్ అయ్యారు. ఆయన లాస్ ఏంజెల్స్ కి ఆ సమయానికి చేరుకోకపోవడమే కారణం అని తెలుస్తుంది. సోమవారం జరిగే ప్రెస్ మీట్లో ఆయన పాల్గొనే అవకాశం కలదు. కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 ని ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయకున్నా గ్లోబల్ వేదికలపై సత్తా చాటుతుంది. రాజమౌళికి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అత్యంత కీర్తి తెచ్చిపెడుతుంది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ స్ట్రాంగ్ రన్ కొనసాగుతుంది. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.
