హమ్మయ్య.. RRR గ్యాంగ్ రెడీ!

First Published 15, May 2019, 8:12 PM IST
rajamouli new plans for rrr schedule
Highlights

 

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సౌత్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR షూటింగ్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలిద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో షెడ్యూల్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సౌత్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR షూటింగ్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలిద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో షెడ్యూల్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో సినిమా రిలీజ్ డేట్ (జులై 30, 2020) కూడా వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వచ్చింది. 

అసలు మ్యాటర్ ఏమిటంటే. ఇప్పుడు జక్కన్న షెడ్యూల్ ని మొత్తం మళ్ళీ రీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మధ్యలో ఆగిపోయిన షెడ్యూల్ ని,  వృధా అయినా సమయాన్ని మొత్తం నెక్స్ట్ డేస్ లో కవర్ చేసే విధంగా పకడ్బందీగా సిద్దమైనట్లు సమాచారం. మే 21న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన సెట్ లో తారక్ - చరణ్ కలవనున్నారు. 

వీరితో పాటు షూటింగ్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొననుంది. ఆ తరువాత అజయ్ దేవగన్ కూడా జక్కన్న టీమ్ లో కలవనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.  

loader