Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి దృష్టిలో వాళ్ళు నిజమైన యోధులు..!

కరోనా వైరస్ నుండి కోలుకున్న రాజమౌళి నేడు ఓ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా రోగులకు ప్రాణ దానం చేసే ప్లాసా డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రసంగంలో రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. 

rajamouli made an inspirational speech at plasma donors felicitation event
Author
Hyderabad, First Published Aug 18, 2020, 7:10 PM IST

రెండు వారాల పోరాటం తరువాత రాజమౌళి మరియు ఆయన కుటుంబం కరోనా నుండి కోలుకున్నారు  కరోనా లక్షణాలు కనిపించడంతో రాజమౌళి కుటుంబం పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఆ పరీక్షలలో వారికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో రాజమౌళి కుటుంబం హోమ్ కొరెంటైన్ కావడంతో పాటు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుండి కోలుకున్న వెంటనే రాజమౌళి కరోనా రోగులకు ప్లాస్మా దానం చేయనున్నట్లు చెప్పడం విశేషం. దానికి రెండు నుండి మూడు వారాల సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పగా, వెంటనే ప్లాస్మా దానం చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇక నేడు రాజమౌళి ప్లాస్మా డొనేట్ చేసినవారి అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ సందేశం ఇచ్చిన రాజమౌళి పోలీసులను మరియు ప్లాస్మా డోనర్స్ పై అభినందనలు కురిపించారు. ముఖ్యంగా కష్ట కాలంలో తమ సేవల పరిధిని పెంచుకొని, నిర్విరామంగా సేవలు చేస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక కరోనా రోగులను కాపాడే ప్లాస్మా డొనేషన్ పై అవగాహన పెంచుతూ ప్రముఖులను, సామాన్యులను ఈ గొప్ప కార్యక్రంలో భాగం చేస్తున్న కమిషనర్ సజ్జనార్ ని రాజమౌళి కొనియాడారు. 

ఇక ప్లాస్మా డోనర్స్ ని యోధులుగా, నిజమైన హీరోలుగా రాజమౌళి కీర్తించారు. తనలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిన వెంటనే ప్లాస్మా డొనేట్ చేస్తాను అన్నారు. అలాగే ప్లాస్మా డొనేట్ చేయడం వలన బలహీన పడతారని అపోహ పడుతున్నారని, తల్లిదండ్రులు భయపడుతున్నారని అన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ప్లాస్మా సేకరిస్తూ ఉండగా, భయపడాల్సిన పనిలేదు అని ధైర్యం చెప్పారు. నేటి రాజమౌళి స్పీచ్ అనేక మందిలో స్ఫూర్తి నింపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios