Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి లాంచ్ చేసిన ‘బ్రహ్మాస్త్ర’లోగో

కింగ్ నాగార్జున దాదాపు పదిహేనేళ్ల  తర్వాత హిందీ చిత్రం చేస్తున్నారు. అది కూడా 2019 మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘బ్రహ్మాస్త్ర’  చిత్రంతో అక్కడ అడుగు పెడుతున్నారు. బాలీవుడ్ లో ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రలో నాగార్జున పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. 

Rajamouli launched Telugu logo of #Brahmastra
Author
Hyderabad, First Published Mar 11, 2019, 12:08 PM IST

కింగ్ నాగార్జున దాదాపు పదిహేనేళ్ల  తర్వాత హిందీ చిత్రం చేస్తున్నారు. అది కూడా 2019 మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘బ్రహ్మాస్త్ర’  చిత్రంతో అక్కడ అడుగు పెడుతున్నారు. బాలీవుడ్ లో ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రలో నాగార్జున పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. ఆ క్రమంలోనే  ఇప్పటికే ఈ సినిమా లోగో ఆవిష్కరణ  జరిగింది. ప్రయాగ (కాశీ)లోని కుంభమేళా జరిగే చోట నింగిలో ఈ లోగోని చిత్రయూనిట్ ఆవిష్కరించింది.

మేళాకు విచ్చేసిన శివభక్తుల సమక్షంలో ప్రమోషనల్ బ్రహ్మాస్త్రాన్ని సంధించింది టీమ్. ఇక తాజాగా ఈ చిత్రం తెలుగు లోగోని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఈ లోగో టీజర్ ని విడుదల చేసారు. ఈ టైటిల్ లోగోలో రణ్‌వీర్ కపూర్..అమితాబ్ బచ్చన్‌ను ... ప్రపంచంలో ఏదైనా ఒక అస్త్రం ఉన్నాదా... అది కలిపితే గుండ్రంగా ఉంటుంది. దానిపై ఒక గుర్తు కూడా ఉంది అంటూ  అడుగుతాడు. దానికి అమితాబ్ అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం అని చెబుతాడు.  

రణవీర్ కపూర్ అలియా భట్ జంటగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.  హీరూ జోహార్ అపూర్వ మెహతా ఆసిమ్ జబాజ్ గులాబ్ సింగ్ తన్వర్ నిర్మిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయింది. బ్రహ్మాస్త్ర లోగో  వీక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోది. 

బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొదటి భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 25 డిసెంబర్ 2019న హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇతర భాగాల్ని తదుపరి తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతూనే ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios