దర్శకధీరుడు రాజమౌళి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో జక్కన్న ఇప్పటికే తెలుగు చిత్రాన్ని ప్రపంచ పటంలో పెట్టారు. 

దర్శకధీరుడు రాజమౌళి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో జక్కన్న ఇప్పటికే తెలుగు చిత్రాన్ని ప్రపంచ పటంలో పెట్టారు. తద్వారా తెలుగు సినిమాకి, ఇండియా సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాక.. తన ఖ్యాతిని కూడా పెంచుకున్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియన్ సినిమాని హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువ చేశాడు. ఆస్కార్ అవార్డుతో సినీ ప్రేక్షకులని పులకరింతకి గురిచేశారు. ఇప్పుడు రాజమౌళికి మరో ఘనత దక్కింది. ప్రతిష్టాత్మకమైన టైం మ్యాగజైన్ వరల్డ్ లో 100 మోస్ట్ ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. 

ఈ జాబితాలో ఇండియా తరుపున చోటు దక్కించుకున్న తొలి ఫిలిం మేకర్ గా రాజమౌళి రికార్డు సాధించారు. ఈ జాబితాలో మరో ఇండియన్ గా షారుఖ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. మార్గదర్శకులు జాబితాలో రాజమౌళికి స్థానం దక్కగా.. ఐకాన్స్ జాబితాలో షారుఖ్ టాప్ 100లో నిలిచారు. 

Scroll to load tweet…

దీనితో జక్కన్నకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ కి తన సత్తా ఏంటో రాజమౌళి చూపించారు. ఇక తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సాగే సాహసికుడి కథగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రాజమౌళి ఏకంగా హాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ సినిమాతో రాజమౌళి కనీవినీ ఎరుగని విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.