Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రిలీజ్ డేట్: రాజమౌళి ఆలోచన ఇది..

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

Rajamouli in no hurry to fix the release date of RRR
Author
Hyderabad, First Published Sep 25, 2021, 8:01 AM IST

అందరూ ఊహించిన్నట్టే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదల మరోసారి వాయిదా పడింది. ప్రపంచ సినీ మార్కెట్లు ఇంకా తెరుచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర టీమ్ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రకటించింది.స్టార్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా  షూటింగ్ ని పూర్తి చేసిన చిత్రటీమ్, తుదిదశ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. కొన్నాళ్లుగా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతోందనే ప్రచారం సాగుతోంది.


 ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తిచేశాం. అయితే  చాలామంది అనుకుంటున్నట్టుగా మేం విడుదలను వాయిదా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఇంకా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు తిరిగి ప్రారంభమైన వెంటనే సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రటీమ్  ట్విటర్‌ ద్వారా తెలిపింది.   ఈ నేపద్యంలో రాజమౌళి ఆలోచన ఏమిటి?

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది జరిగేపని కాదని తేలిపోయింది.  ఆ తర్వాత సంక్రాంతి 2022 కి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అదీ కష్టమే అంటున్నారు. సంక్రాంతికి ఆల్రెడీ చాలా సినిమాలు రేసులు ఉండటం ఒక కారణం అయితే..తమ సినిమాను దేశం మొత్తం ఒకే రోజు భారీ ఎత్తున రిలీజ్ చేయాలంటే అన్ని చోట్లా కరోనా పరిస్దితులు చక్కబడాలి. ప్రస్తుతం కేరళ,నార్త్ లో పరిస్దితులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపధ్యంలో రాజమౌళి వచ్చే వేసవికి రిలీజ్ ప్లాన్ చేసే అవకాసం ఉంది. ఇంకా చాలా సమయం ఉండటం, కరోనా పరిస్దితులు పూర్తిగా చక్కబడి థియోటర్స్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉండటంతో రాజమౌళి ఏమీ కంగారుపడటం లేదట. వెయిట్ అండ్ సీ మోడ్ లో ఉన్నారట.  
 
 1920వ దశకం నేపథ్యంలో సాగే కథ. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలియాభట్‌, శ్రియ, అజయ్‌ దేవగణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, కొమరం భీం పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్స్ విడుదలై అభిమానులను అలరించాయి. చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తోంది.  ఐరిష్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios