ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. ఆయన తన భార్య రమా రాజమౌళి తో కలిసి కర్ణాటకలోని దేవాలయాన్ని సందర్శించారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో ఉన్న పురాతన హిమవద్ గోపాల స్వామి గుళ్లో ఆయన  పూజలు చేసారు. 

 ఇక రీసెంట్ గా   కరోనావైరస్  పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.  2 వారాల పాటు క్వారంటైన్  పూర్తి చేసుకున్న రాజమౌళి.. తమ కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నామని, అందరికీ ఈ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది అని రాజమౌళి తెలిపాడు. ఈ క్రమంలో రిలాక్స్ అవటం కోసం ఇలా వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
 ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ‘జక్కన్న’ తీస్తున్న మూవీ కావడంతో RRRపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.