రీసెంట్ గా  జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ చాలా సరదాగా జరిగింది. మీడియా నుంచి సినీ అభిమానులు దాకా అందరూ ఫుల్ ఖుషీ. అయితే రాజమౌళి మాత్రం తన నిర్మాత ప్రవర్తకు మండిపడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం దానయ్య...అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించి, తన స్పీచ్ లో భాగంగా కొన్ని మీడియాకు చెప్పకూడని వివరాలు అక్కడ చెప్పటమే అంటున్నారు. 

ఆ రోజు నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. మరి బిజినెస్ ఎంత ఆశిస్తున్నారు అనే ప్రశ్నకు మాత్రం అది ఇప్పుడే ఎలా చెప్తాం ఫైనల్ గా అన్ని పూర్తయ్యాక వెల్లడి చేస్తాను అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంటే 100 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అన్న దానయ్య రాజమౌళితో సినిమా చేయాలన్న కోరికతోనే ఈ ప్రాజెక్ట్‌ను విడిచి పెట్టలేదని తెలిపారు. 

ఈ వంద కోట్ల మ్యాటరే రాజమౌళికి ఒళ్లు మండేలా చేసిందంటున్నారు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేనివేని ప్రసాద్ లు ఈ ప్రాజెక్టు తమకు అప్పచెప్పమని అందుకు ప్రతిగా వంద కోట్లు దానయ్యకు ఆఫర్ చెయ్యటం..దాన్ని దానయ్య రిజెక్ట్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని చెప్పి...అందరి దృష్టీ తన స్నేహితులైన బాహుబలి నిర్మాతలపై పడేలే చేసారని రాజమౌళి కోపంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మీడియాతో మాట్లాడేటప్పుడు ఇక నుంచైనా కాస్తంత జాగ్రత్తగా ఉండమని లేకపోతే రకరకాల సమస్యలు తెచ్చిపెడతారని రాజమౌళి హెచ్చరించినట్లు వినికిడి. 

2019 డిసెంబర్‌ లేదా 2020 జనవరిలో షూటింగ్ పూర్తవుతుందని తరువాత ఆరు నెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి జూలై 30 న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. 

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు.. చిన్నపుడు ఎంత ముద్దుగా ఉన్నారో

2000 - 2019: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ by year