ఫిల్మ్ సర్కిల్, మీడియాలో వచ్చే వార్తలు నిజమైతే గత కొద్ది రోజులుగా రాజమౌళి...సైరా చిత్రం ఎడిటింగ్ టేబుల్ దగ్గర గడుపుతున్నారట. రామ్ చరణ్ రిక్వెస్ట్ పై రాజమౌళి ఈ పని చేసిపెడుతున్నారని వినికిడి.  ఫైనల్ కట్ రెడీ చేసే ముందు రాజమౌళి ఇన్ ఫుట్స్ తీసుకోవాలని రామ్ చరణ్ భావించారట. సురేంద్రరెడ్డి సైతం అందుకు సై అన్నారని చెప్తున్నారు. అయితే వేరే దర్శకుడు పనిలో వేలు పెట్టడానికి మొదట రాజమోళి ఇష్టపడనప్పటికీ చిరంజీవి సైతం అడగటంతో కాదనలేకపోయారని అంటున్నారు.  

అయితే సాహో విషయంలోనూ ఈ విధమైన వార్తలే వచ్చాయి. రిలీజ్ కు ముందు ప్రభాస్ తీసుకెళ్లి రాజమోళిని సాహో సినిమా చూపించి సలహాలు చెప్పమన్నారని చెప్పుకున్నారు. బాహుబలి వంటి మెగా సినిమా తర్వాత రాజమోళిని తీసుకెళ్లి పెద్ద సినిమాల వాళ్లు తమ సినిమాలకు సూచనలు అడగటంలో అయితే వింత ఏమీ లేదు.

రీసెంట్ గా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం `సాహో` కలెక్షన్ల పరంగా  ఓకే అనిపించినప్పటికీ.. కంటెంట్ విషయంలో విమర్శలెదుర్కొన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై రివ్యూలలో దారుణమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా లెంగ్త్, స్క్రీన్ ప్లే విషయంలో ఆ విమర్శలు ఎదురయ్యాయి. దీంతో త్వరలో విడుదల కాబోతున్న `సైరా` జాగ్రత్తపడుతున్నట్టు సమచారం.

అనేక భాషలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తుండడంతో `సైరా` రన్‌టైమ్ కూడా ఇంచుమించుగా మూడు గంటలు వచ్చిందట. దీంతో కొంత ఎడిట్ చేసి లెంగ్త్ తగ్గించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.  

మరో ప్రక్క ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకకు  సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారు. ప్రీ రిలీజ్‌, ట్రైలర్‌ విడుదల వేడుక ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా గురువారం ప్రకటించారు.