Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి బేబీ వెనుక చాలా పెద్ద కథే ఉంది

  • బాహుబలి సినిమాలో నటించిన 18 రోజుల పాప
  • ఆ పసికందుది కేరళలోని కలాడీ అనే ఊరు
  • రాజమౌళి ప్రొడక్షన్ అసిస్టెంట్ వల్సన్ కూతురు
rajamouli baahubali shot it with real baby for perfection

రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆ సినిమా గురించి ఆ సినిమాలో కీలకమైన ఒకరు మాత్రం తనకేం పట్టనట్టు తన పని తాను చేసుకుంటోంది. ఇంతకీ ఎవరది.

 

బాహుబలి సినిమా అనగానే ఫస్ట్ ప్రారంభం అయ్యేది నదిలోనే. జోరుగా నదీ ప్రవాహం, ఆప్రవాహంలో నీళ్ల పైకి తేలుతూ ఒక చేయి. ఆ చేయిలో ఒక పసికందు. శివుడిగా, మహేంద్ర బాహుబలిగా ఎదిగిన ఆ పసికందు దేశవ్యాప్తంగా సంచలనం. బాహుబలి ప్రమోషన్ లో కీలక పాత్ర పోషించి, సినిమాలో హైలెచ్ గా నిలిచిన ఆ పసికందు ఇప్పుడు బాహుబలితో తనకేం సంబంధం లేనట్టు తన పని తాను చేసుకుంటోంది.

 

ఇంతకీ ఈ బేబీ ఎవరంటే పేరు అక్షర. 18 రోజుల వయసులోనే బాహుబలి లో ఛాన్స్ కొట్టేసింది. కేరళ, నల్లేశ్వరం ఏరియాలోని కళాడీ అనే ఊళ్లో ప్రస్థుతం జాలీగా తన చిన్నతనపు చిలిపి పనులతో నవ్వులు పూయిస్తోంది.  ఆ పాప బాహుబలి సినిమాకు కెనెక్ట్ అవడం వెనక పెద్ద కథే ఉంది.

 

బాహుబలి షూటింగ్ కేరళలోని అత్తిరాపల్లి జలపాతం దగ్గర జరుగుతుంటే రాజమౌళి తనకు రోజుల వయసున్న పసికందు కావాలని అడిగాడు. బొమ్మతో షో చేయకుండా రియాలిటీ ఉంటేనే ఆ సీన్ పండుతుందని రాజమౌళి ఆలోచించాడు. సినిమా షూటింగులకు మరీ నెల రోజులు కూడా నిండని పసి కందును ఇవ్వడమంటే ఎవరూ సాహసించరు. కానీ రాజమౌళి దగ్గర పనిచేస్తున్న ప్రొడక్షన్ అసిస్టెంట్ వల్సన్ ఎలాగోలా తన భార్యను ఒప్పించి తమ బిడ్డను రాజమౌళి చేతిలో పెట్టారు.

 

షూటింగ్ జరిగినన్ని రోజులు  తల్లీ బిడ్డలిద్దరూ స్పాట్ లో నే ఉండి పని పూర్తి చేయాలన్న రాజమౌళి విన్నపానికి ఓకే చెప్పిన ఆ కుటుంబం షూటింగ్ పూర్తయే వరకు సహకరించింది. అది పెద్ద సంచలనమైంది. అదీ స్టోరీ.

Follow Us:
Download App:
  • android
  • ios