యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ బ్రిటిష్ కాలం నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశం మొత్తం చిత్రం కోసం ఎదురుచూస్తోంది. 

అలియా భట్ రాంచరణ్ కు హీరోయిన్ గా, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యమవీరుడు కొమరం భీంపాత్రలో, చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఎన్టీఆర్ కు భారీ పని అప్పగించినట్లు తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో, హిందీలో తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళం, హిందీ భాషలపై కొంతవరకు పట్టు ఉండొచ్చు. కానీ నార్త్ ఆడియన్స్ కు తగ్గట్లుగా యాస పలకగలగడమే ఛాలెంజ్. దీనిని ఎన్టీఆర్ ఎలా అధికమిస్తాడో చూడాలి. ఎన్టీఆర్ కు గాంభీర్యమైన వాయిస్ ఉండడం కలసివచ్చే అంశం.