Asianet News TeluguAsianet News Telugu

`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` పై రాజమౌళి ప్రశంసలు.. నవీన్‌ పొలిశెట్టి క్రేజీ రియాక్షన్‌..

దర్శకధీరుడు రాజమౌళి..  అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి `చిత్రంపై ప్రశంసలు కురిపించారు. హిలేరియస్‌గా నవ్వించిన చిత్రమంటూ ట్వీట్‌ చేశారు.

rajamouli appreciations on miss shetty mr polishetty movie arj
Author
First Published Sep 8, 2023, 6:43 PM IST

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కలిసి నటించిన `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమా గురువారం విడుదలైంది. ఫన్‌, ఎమోషనల్‌ రైడర్‌గా ఈ చిత్రం మంచి ప్రశంసలందుకుంది. పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. డీసెంట్‌గా కలెక్షన్లని రాబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. సినిమా అదిరిపోయిందంటూ ఆయన ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. 

స్వీటి అనుష్క ఎప్పటిలాగే అందంగా తెరపై మెరిసింది. నవీన్‌ పొలిశెట్టి తన నటనతో సరదాగా నవ్వులు పూయించాడు. మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో సక్సెస్‌ అందుకున్న టీమ్‌ మెంబర్స్ కంగ్రాట్స్. సెన్సిటివ్ అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని ఇంత ఫన్‌తో సినిమాని రూపొందించిన దర్శకుడు మహేష్‌ బాబు. పి కి నా అభినందనలు అని తెలిపారు రాజమౌళి. 

దీనికి హీరో నవీన్‌ పొలిశెట్టి స్పందించారు. క్రేజీగా రియాక్ట్ అయ్యారు. `ఓ మై గాడ్‌.. లెజెండ్‌ రాజమౌళి మా సినిమాని ఇష్టపడ్డారు. థ్యాంక్యూ సో మచ్ సర్‌, మిమ్మల్ని నవ్వించగలిగినందుకు ఆనందంగా ఫీలవుతున్నాం. గాయ్స్ ఈ వీకెండ్‌కి వెళ్లి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమాని వీక్షించండి. థియేటర్లలో పిచ్చెక్కించే డాన్స్ చేయండి. ప్రతి ఐదు నిమిషాలకు ఈ ట్వీట్‌ని రీడ్‌ చేయండి` అంటూ క్రేజీగా రియాక్ట్ అయ్యాడు నవీన్‌ పొలిశెట్టి. 

ఇక దాదాపు ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై ఈ సినిమాతో మెరవడం విశేషం. చివరగా ఆమె `భాగమతి` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `సైలెంట్‌` మూవీలో మెరిసినా, అది ఓటీటీలో రిలీజ్‌ అయ్యింది. ఇక `జాతిరత్నాలు` వంటి బాస్టర్‌ కామెడీ చిత్రం తర్వాత నవీన్‌ పొలిశెట్టి నటించిన చిత్రమిది కావడం విశేషం. సినిమా కూడా అదే రేంజ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. దీనికి స్పెర్మ్ డొనేషన్‌ అనే సెన్సిటివ్‌ పాయింట్‌ని చర్చించారు. దర్శకుడు మహేష్‌బాబు. పి దీనికి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios