జువల్ ఎఫెక్ట్స్ అనేవి హిస్టారికల్ మూవీస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు స్టార్ హీరోల అన్ని సినిమాల్లో ఎదో ఒక విధంగా VFX అవసరం పడుతోంది. ఇక సైరా సినిమాలో కూడా ఎవరు ఊహించని రేంజ్ లో అత్యధిక VFX షాట్స్ క్రియేట్ చేశారు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు రాజమౌళి ఆ విషయంపై స్పందించాడు. 

బాహుబలిలో మొత్తంగా 2300 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండగా ఇప్పుడు సైరా లో అంతకుమించి 3800VFX షాట్స్ ఉన్నట్లు విఎఫ్ఎక్స్ చీఫ్ కనల్ ఖన్నన్ చెప్పినట్లు రాజమౌళి మాట్లాడారు. అంటే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఓ విధంగా ఈ సినిమా తెరకెక్కడానికి ప్రధానం కారణం రాజమౌళి గారు ముఖ్య కారణమని కూడా మెగాస్టార్ ఈవెంట్ లో వివరణ ఇచ్చారు. 

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాల ఖ్యాతిని ఫ్యాన్ ఇండియన్ లెవెల్ కి తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఫైనల్ గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నిటినీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ రిలీజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాలో నయనతార - తమన్నా కథానాయికలుగా నటించారు.