యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ కొంచెం డల్ అయ్యిందని చెప్పాలి. ఆయన క్లీన్ హిట్ అందుకొని చాలాకాలం అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో వరుస హిట్స్ అందుకున్న ఈ యంగ్ ఈ హీరో ఈ మధ్య విజయాల పరంగా వెనుకబడ్డారు. దిల్ రాజు నిర్మాతగా గత ఏడాది విడుదలైన ఇద్దరి లోకం ఒకటే మంచి హిట్ అందుకుంటుందని రాజ్ తరుణ్ ఆశపెట్టుకున్నాడు. ఐతే ఆ చిత్రం కూడా భారీ ప్లాప్ గా నిలిచింది. దీనితో తన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగానే నమ్ముకున్నాడు రాజ్ తరుణ్. 

కాగా ఈ యంగ్ హీరో తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి గెస్ట్ గా వచ్చాడు. అలీతో సరదా సంభాషణలో అనేక విషయాలు పంచుకున్నాడు. అక్టోబర్ 2న ప్రసారం కానున్న అలీతో సరదాగా షో ప్రోమో బయటికి రావడం జరిగింది. ఆ ప్రోమోలో రాజ్ తరుణ్ తను బ్యాడ్ బాయ్ అని చెప్పుకున్నారు. కుమారి 21 ఎఫ్ మూవీలో దేవిశ్రీ స్వర పరచిన ఓ సాంగ్ లో బాడ్ బాయ్స్ బ్యాంకాక్ వెళతారని లిరిక్స్ ఉంటాయి. ఆ సినిమా హీరో అయిన రాజ్ తరుణ్ ని బ్యాంకాక్ వెళ్ళావా అని అలీ అడుగగా, నేను బ్యాడ్ బాయ్ నే బ్యాంకాక్ వెళ్ళాను అని సమాధానం చెప్పారు. 

ఇక 27 ఏళ్ళ ప్రాయం రాగానే పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ పేరెంట్స్ కి మాట ఇచ్చారట. పదో తరగతి చదివే రోజుల్లోనే అమ్మాయిలకు ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ లో చేసేవాడట. ఇక లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న రాజ్ తరుణ్, ఎవరైనా ఉన్నారా అని అలీ అడుగగా అలాంటిది ఏమీ లేదు అన్నారు. రాజ్ తరుణ్ తో అలీతో సరదాగా ప్రోమో ఆసక్తి రేపుతోంది. ఫుల్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మరింత ఫన్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది.