Asianet News TeluguAsianet News Telugu

ఫుల్ ఫన్ ట్రైలర్: "అనుభవించు రాజా" కు 'బంగార్రాజు' భరోసా

‘రూపాయి పాపాయి లాంటిది రా..దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ..ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు..‘అంటూ వ‌చ్చే డైలాగుతో మొద‌లైంది ట్రైల‌ర్‌. మొద‌ట్లో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించి..ఆ త‌ర్వాత పల్లెలో కోడి పందాల‌తో స‌ర‌దా లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాడిగా క‌నిపిస్తున్నాడు.

Raj Tarun Anubhavinchu Raja Trailer
Author
Hyderabad, First Published Nov 17, 2021, 5:33 PM IST

రీసెంట్ గా "పవర్ ప్లే" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్  హీరో రాజ్ తరుణ్ ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడనే సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు "అనుభవించు రాజా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతున్నారు. శ్రీనివాస్ గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అజయ్, కృష్ణ మురళి పోసాని, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుదర్శన్, అరియానా మరియు ఆదర్శ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్  కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ఫుల్ ఫన్ తో  సాగుతుందని అర్థమవుతుంది. అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘రూపాయి పాపాయి లాంటిది రా..దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ..ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు..‘అంటూ వ‌చ్చే డైలాగుతో మొద‌లైంది ట్రైల‌ర్‌. మొద‌ట్లో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించి..ఆ త‌ర్వాత పల్లెలో కోడి పందాల‌తో స‌ర‌దా లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాడిగా క‌నిపిస్తున్నాడు. అంటే సెక్యూరిటీ గార్డ్ అవటానికి ..పల్లెలో రాజాలా వెలిగటానికి మధ్య కథలా ఉంది.  అలాగే  ‘ వ‌చ్చే సంవ‌త్స‌రం ఇదే రోజు..ఇక్క‌డే జెండా ఎగ‌రేస్తా..ప్రెసిడెంట్‌గా ‘ అంటూ చివ‌ర‌లో రాజ్‌త‌రుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

నవంబర్ 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కు ముందు,వెనక రెండు వారాలు పాటు పెద్దగా కాంపిటేషన్ లేకపోవటం కలిసొచ్చే అంశం ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ మంచి హిట్టైంది. "రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా" అంటూ ఈ పాట సాగుతోంది.

"అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ .. కల్లుకైనా కనికరించవా .. మందుకైనా మన్నించవా" అంటూ ఈ పాట ద్వారా హీరో పాత్ర తీరు తెన్నులు చెప్పే ప్రయత్నం చేశారు. మొలతాడైనా మనతో రాదు .. అవకాశం ఉన్నప్పుడే అన్నీ అనుభవించేయ్ అంటూ భాస్కరభట్ల అందించిన సాహిత్యాన్ని రామ్ మిరియాల ఆలపించాడు.  గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇది. రాజ్‌తరుణ్‌ సరసన కషికా ఖాన్‌ నటిస్తోంది.  పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్,సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నగేశ్‌ బానెల్, సంగీతం: గోపీసుందర్‌.అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios