యంగ్ హీరోయిన్ అవికా గోర్ హీరో రాజ్ తరుణ్ పై తన ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఆమె రాజ్ తరుణ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారాయి. హీరో రాజ్ తరుణ్ గురువారం సాయంత్రం కొత్తగా నిర్మించుకున్న గృహ ప్రవేశ వేడుక జరుపుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కావడం జరిగింది.  ఇక చిత్ర పరిశ్రమ నుండి హీరోయిన్ అవికా గోర్ హాజరయ్యారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో అవికా గోర్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అవికా గోర్ ఈ వేడుకకు హాజరుకావడంతో రాజ్ తరుణ్ ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. నా మొదటి చిత్రం నుండి... నూతన గృహ ప్రవేశం వరకు నాతో ఉన్న అవికాకు ధన్యవాదాలు అని రాజ్ తరుణ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కి అవికా రిప్లై ఇవ్వడం జరిగింది. నిన్ను చూసి గర్వపడుతున్నాను రాజ్, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. అమీ తుమాకే భాలోబాషి అని బెంగాలి భాషలో ఐ లవ్ యూ చెప్పింది. 


పెళ్లి కానీ ఈ ఇద్దరు యంగ్ యాక్టర్స్ ఈ రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా ప్రేమ కురిపించుకోవం ఆసక్తిగా మారింది. 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా మూవీతో  రాజ్ తరుణ్, అవికా గోర్ వెండితెరకు హీరో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Tarun (@rajtarunn)