అత్యంత భావోద్వేగంగా సాగిన శిల్పా శెట్టి పోస్ట్ చాలా మంది సెలబ్రిటీలు కదిలించింది. దీనితో ఆమెకు కొందరు మద్దతుగా కామెంట్ చేయడం జరిగింది.  


నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కాబడిన రాజ్ కుంద్రాపై విచారణ కొనసాగుతుంది. రాజ్ కుంద్రా అరెస్ట్ ఆయన సతీమణి శిల్పా శెట్టిని చిక్కుల్లోకి నెట్టింది. సోషల్ మాద్యమాలతో పాటు మీడియాలో రాజ్ కుంద్రా కుటంబానికి వ్యతిరేకంగా అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా శిల్పా శెట్టి సుదీర్ఘ సందేశం విడుదల చేశారు. 


గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పిన శిల్పా శెట్టి, మీడియాలో తమ కుటుంబంపై నిరాధారమైన రాతలు ఆపివేయాలని కోరుకున్నారు. ముంబై పోలీసులు, భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. విచారణ జరుగుతుండగా తప్పుడు ప్రచారాలు చేయడం మానేయాలని ఆమె తన సోషల్ మీడియా సందేశంలో తెలియజేశారు. ముఖ్యంగా తన, తన కుటుంబ ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని శిల్పా శెట్టి కోరుకున్నారు. అత్యంత భావోద్వేగంగా సాగిన శిల్పా శెట్టి పోస్ట్ చాలా మంది సెలబ్రిటీలు కదిలించింది. దీనితో ఆమెకు కొందరు మద్దతుగా కామెంట్ చేయడం జరిగింది. 

శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి ఆమెకు సప్పోర్ట్ గా కామెంట్ చేశారు. మంచి చెడులో ఎప్పుడూ నీతోనే ఉంటా... ఐ లవ్ యూ ముంకీ అంటూ షమితా కామెంట్ పెట్టారు. అలాగే హీరో ఆర్ మాధవన్ సైతం శిల్పా శెట్టికి మద్దతుగా నిలవడం విశేషం. నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఈ గడ్డు పరిస్థితుల నుండి నువ్వు గౌరవంగా బయటపడతావు. మా ప్రేయర్స్ ఎప్పుడూ నీతో ఉంటాయని మాధవన్ కామెంట్ చేశారు. 

View post on Instagram