బిగ్ బాస్ 7లో మరో కంటెస్టెంట్ గా రైతు బిడ్డ  పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు. లైఫ్ కి సంబందించిన కష్ట నష్టాలు, వ్యవసాయం పై తనకున్న మక్కువ గురించి ప్రశాంత్ వివరించాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 లో రూల్స్ మొత్తం మారిపోనున్నాయి. దీనితో ఈ సీజన్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచేస్తున్నారు. 

బిగ్ బాస్ 7లో మరో కంటెస్టెంట్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు. లైఫ్ కి సంబందించిన కష్ట నష్టాలు, వ్యవసాయం పై తనకున్న మక్కువ గురించి ప్రశాంత్ వివరించాడు. ప్రశాంత్ లైఫ్ జర్నీ తెలిస్తే ఎవరికైనా గుండె బరువెక్కాల్సిందే. మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని మా నాన్నని అడిగితే.. చదువుకున్నాడు, వ్యవసారం చేస్తున్నాడు అని చెప్పారు. వ్యవసాయం చేస్తున్నాడా అంటూ చిన్నచూపు చూసిన వాళ్ళు ఉన్నారు. 

ఎవరు ఏమనుకున్నా నాకు నచ్చిన పనే నేను చేయాలనుకున్నా. రైతు బాధ ఏంటో రైతు కొడుకుకి మాత్రమే అర్థం అవుతుంది. ఎలాంటి జాబ్ చేసినా ఒకరి కింద బతకాల్సిందే. అదే ఇక్కడ పనిచేస్తే నేను బతకడమే కాదు నలుగురు కడుపు నింపుతా. 

Scroll to load tweet…

నేను మొదట ఒక జానపద గీతం చేశా. దాని ద్వారా 4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కానీ నా స్నేహితులు మోసం చేసారు. మొదట్లో నాకు అన్ని అవమానాలే ఎదురవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అని అంటుంటే మా నాన్న చాలా గర్వపడుతున్నారు. అదే నాకు సంతోషాన్ని ఇస్తోంది అని ప్రశాంత్ తెలిపారు. 

ఇక ప్రశాంత్ వేదికపైకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. తాను పండించిన బియ్యం బస్తాని నాగార్జునకి గిఫ్ట్ గా ఇచ్చారు. తన పొలంలోని మట్టిని కూడా తీసుకువచ్చారు. ఇక ప్రశాంత్ కి నాగార్జున ఒక మిర్చి మొక్కని గిఫ్ట్ గా ఇచ్చారు. దానిని హౌస్ లో జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు. అది మిర్చి కాస్తే మరిన్ని బెనిఫిట్స్ ఇస్తానని నాగార్జున అన్నారు.