అయితే ఒక్కోసారి ఇదే శృతిమించి అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటి పోతుంది . ఇలాంటి వార్తలు మనం అప్పుడప్పుడూ మీడియాలో చూస్తూంటాం. అయ్యో అనుకుంటాం. 
ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి కష్టం వచ్చిందట .. లక్ష్మి రాయ్ తన ఇంటికి వచ్చినా కరెంట్ బిల్లును చూసి షాక్ అవుతుందట ..!   ఆమె ఎంత బిల్ పే చేస్తుందో.. అంతకు రెట్టింపు బిల్లు తర్వాత నెలలో యాడ్ అవుతూ బిల్ వస్తుందట. ఇలా మూడు నెలలుగా జరుగుతుందని, ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదని, దీనిపై ఎవరైనా సహాయం చేయండని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
‘‘కొన్ని నెలలుగా మాకు వస్తున్న కరెంట్ బిల్లును పరిశీలిస్తున్నాను. ఈ మంత్ నేను ఎంత బిల్ పే చేస్తున్నానో.. దానికి డబుల్ బిల్ మరుసటి నెల వస్తోంది. ఇలా గత మూడు నెలలుగా జరుగుతోంది. దీనిపై కంప్లయింట్ ఇవ్వడానికి ఆదాని ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదు. నాలా ఎంతమంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారో..అని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ సమస్య నుంచి నన్నెవరైనా గట్టెక్కించండి. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే నాకు ఎంతో బాధగా ఉంది..’’ అని రాయ్ లక్ష్మీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

రాయ్ లక్ష్మీ సమస్యను తెలుసుకున్న ఆదాని ఎలక్ట్రిసిటీ బోర్డ్.. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. దయచేసి మీ అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేయగలరు. మీ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాము..’’ అని ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. హమ్మయ్య అనుకుని ఉంటుంది రాయ్ లక్ష్మి. ఆమె స్టార్ హీరోయిన్ కాబట్టి వెంటనే ఎలట్రస్టీ బోర్డ్ స్పందించింది. మనలాంటి సామాన్యుల మాట వింటుందా అని సోషల్ మీడియాలో గొణుగుడులు వినపడుతున్నాయి.