అంజలి, లక్ష్మిరాయ్ కాంబినేషన్ లో మూవీ

First Published 16, Dec 2017, 6:30 PM IST
RAI LAKSHMI AND ANJALI COMBINATION MOVIE
Highlights
  • అంజలి, లక్ష్మిరాయ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ
  • అర్కే స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనున్న మూవీ
  • ఈ మూవీని తెరకెక్కిస్తున్న గుంటూరు టాకీస్ నిర్మాత రాజ్ కుమార్

 

రాయ్‌లక్ష్మి, అంజలి ముఖ్య పాత్రల్లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కే స్టూడియోస్‌ ప్రకటించింది. ‘గుంటూర్‌ టాకీస్‌’ నిర్మాత రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

 

విభిన్న కథాంశంతో తీస్తున్న ఈ సినిమాలో సస్పెన్స్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు అంజలి, రాయ్‌లక్ష్మిలను కలిసినప్పుడు తీసిన ఫొటోలను పంచుకున్నారు.

 

అంజలి కథానాయికగా నటించిన ‘బెలూన్‌’ సినిమా డిసెంబరు 29న విడుదల కాబోతోంది. జై ఇందులో కథానాయికుడిగా నటించారు. థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. మరోవైపు రాయ్‌లక్ష్మి టైటిల్‌ రోల్‌లో నటించిన బాలీవుడ్‌ సినిమా ‘జూలీ 2’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

loader