బిగ్ బాస్ గత సీజన్ లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాళం లవ్ ట్రాక్ ఫుల్ ఫేమస్ అయ్యింది. వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాన్స్ బాగా హెల్ప్ అయ్యింది. గత సీజన్ విన్నర్ గా నిలిచిన రాహుల్, హౌస్ నుండి పునర్నవి ఎలిమినేటైనప్పుడు తెగ ఫీలైపోయాడు. ఎలిమినేటైన పునర్నవి సైతం రాహుల్ విన్నర్ కావడం కోసం భారీ క్యాంపైన్స్ చేసింది. రాహుల్ గెలవడంతో ఆమె ఉబ్బితబ్బిబయ్యింది. విన్నర్ గా హౌస్ నుండి బయటికి వచ్చిన రాహుల్ తరుచుగా పునర్నవి కలిసేవాడు. దీనితో వీరి పెళ్లి ఇక లాంఛనమే అనుకున్నారందరు. ఐతే అవన్నీ పుకార్లే అని ఇద్దరూ కొట్టిపారేశారు. 

నిన్న పునర్నవి తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రముఖ యూట్యూబర్ ఉద్భవ్ రఘునందన్ అనే వ్యక్తితో నిశితార్థం జరిగినట్లు, త్వరలో పెళ్లి అంటూ స్పష్టం చేసింది. దీనితో ఒక్కసారిగా రాహుల్-పునర్నవిల లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. రాహుల్ సైతం పునర్నవి ఎంగేజ్మెంట్ ని ఉద్దేశిస్తూ...పరోక్షంగా ఓ ఎమోషనల్ పోస్ట్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. 

పునర్నవి ఎంగేజ్మెంట్ టాపిక్ కి సోషల్ మీడియాలో రాహుల్ ని ట్యాగ్ చేస్తున్నారట. దీనిపై స్పందించిన రాహుల్, 'ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నారు రా భయ్, ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లు ఎందుకురా నాయన, రేపు బేబీ మ్యూజిక్ వీడియో వస్తుంది..గెట్ రెడీ' అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు. రాహుల్ తాజా పోస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక రాహుల్ పోస్ట్స్ పై పునర్నవి ఇంత వరకు స్పందించలేదు.