తనపై చేసే మీమ్స్ కి, ట్రోలింగ్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. వారి ఔలాగాళ్లతో పోల్చాడు. తనని ఎవరూ ఏం పీకలేరని బోల్డ్ గా కామెంట్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌ స్టోరీస్‌లో ఓ వీడియోని పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాదు, షేక్‌ చేస్తుంది. మరి ఇంతకి ఏం జరిగింది, బిగ్‌బాస్‌3 సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కోపానికి కారణమేంటనేది చూస్తే.. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ అయ్యే ఛాన్స్ ఉందని, హారికా తన ఫేవరేట్‌ అని అరియానా, సోహైల్‌ టాప్‌ ఫైవ్‌లో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు రాహుల్‌ సిప్లిగంజ్‌ గతంలో వ్యాఖ్యానిచ్చారు. దీంతో అభిజిత్‌ అభిమానులు రాహుల్‌ని ఆకాశానికి ఎత్తారు. మిగిలిన కంటెస్టెంట్ల అభిమానులు కూడా రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. 

అయితే ఇటీవల రాహుల్‌ తన మాట మారుస్తూ, సోహల్‌, అరియానాలకు మద్దతు పలికారు. సోహైల్‌ టైటిల్‌ విన్నర్‌ అని చెప్పాడు. హౌజ్‌లో వ్యక్తగత ప్రదర్శన బట్టే సపోర్ట్ ఉంటుందని, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, బాగా ఆడేవాళ్లని జెన్యూన్‌గా సపోర్ట్ చేయండి, నాకు  సొహైల్, అరియానాలను టాప్ 2లో చూడాలని ఉంది. దమ్ము ఉంటే సపోర్ట్.. పనికిరానోళ్లని బయటకు తొయ్యండి` అని మొదట ఆయన పేర్కొన్నాడు. 

దీంతో అభిజిత్‌ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారితోపాటు హారిక, అవినాష్‌, అఖిల్‌, మోనాల్‌ అభిమానులు ఓ రేంజ్‌లో రాహుల్‌ని ఆడుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడంతోపాటు మీమ్స్ చేశారు. జెన్యూన్‌గా గేమ్ ఆడటం గురించి నువ్వే చెప్పాలి.. గత సీజన్‌లో నువ్ ఎలా విన్నర్ అయ్యావో అందరూ చూశారు? శ్రీముఖి తొలి నుంచి బాగా ఆడి.. అన్ని టాస్క్‌లలోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తే పునర్నవితో పులిహోర కలిపి నువ్ విన్నర్ అయ్యావ్.. అయినా నిన్నటి వరకూ అభిజిత్‌కి సపోర్ట్ చేసి ఇప్పుడు వేరేవాళ్లని అంటున్నావ్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఇది తన దృష్టికి రావడంతో రాహుల్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.  ప్రస్తుతం ఆ వీడియో బిగ్‌బాస్‌ని, సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇందులో రాహుల్‌ పలు షాకింగ్‌ కామెంట్లు చేయడం విశేషం. ఇంతకి రాహుల్‌ ఏమంటున్నాడంటే, మీమ్స్, కామెంట్స్, ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో.. ఆ హౌలేగాళ్లకు నేనేం చెబుతున్నానంటే.. మొన్నేదో పోస్ట్ పెట్టుంటే.. ఇంతకు ముందు అభికి సపోర్ట్ చేస్తుండే.. ఇప్పుడు సపోర్ట్ చెయ్యట్లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.. మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అంటే నాకు అర్దం కాదు.. నేనేమైనా.. గంపగుత్త అగ్రిమెంట్ రాసుకుని వచ్చినారా.. ఒక్కనికే సపోర్ట్ చెయ్యాలని? నా ఇంటెన్షన్ ఏంటో తెలుసా? టాప్ 5 బెస్ట్ కంటెస్టెంట్స్ ఉండాలని` అని పేర్కొన్నాడు. 

ఇంకా చెబుతూ, `మీరెన్ని మీమ్స్, ట్రోల్స్ చేసినా నాకు అస్సలు పరాక్‌ పడు. ముగ్గురు నలుగురు గుంతలో పడబోతున్నారు. ఒకరు సేవ్‌ అవుతారని నాకు తెలుసు. ఆ ఒక్కరికి ఎలా సపోర్ట్ చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నా. ఈ టాప్ ఫైనల్ లో రానీకి మిగిలిన ముగ్గురు కూడా గుంతలో పడుతుంటే వాళ్లని కాపాడే బాధ్యత నాదెంతనో మీద కూడా అంతెనే ఉంటుంది. ఒక్కరినే సపోర్ట్ చేస్తానని గుంపుగుత్తగా అగ్రిమెంట్‌ ఏం రాసుకోలేద`న్నారు. 

వారం వారం వారి ప్రదర్శన బట్టి గ్రాఫ్‌ మారిపోతుందని, ప్రతి వారం వారి ఆటతీరు మారుతుంటుంది. మీరేమో ఇవన్నీ ఆలోచించరు. ఈ మీమ్స్ ట్రోల్స్ చేసేటోళ్లు నాకు హౌలాగాళ్లలా కనిపిస్తున్నారు.  ఏదో పోస్ట్ పెట్టానని చెప్పేసి.. ఏదో అన్నానని చెప్పేసి మీమ్స్ ట్రోల్స్ చేస్తే నాకు అస్సలు పరాక్ పడదు. అర్థమైందా? ` అంటూ ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశాడు. ప్రస్తుతం రాహుల్‌ వీడియో సామాజిక మాధ్యమాలకు షేక్‌ చేస్తుంది.