ఎన్టీఆర్ తో పీరియాడిక్ డ్రామా.. ఈ రూమర్ నిజమైతే ఆ డైరెక్టర్ జాక్ పాట్ కొట్టినట్లే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఎన్టీఆర్ తదుపరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. అదే విధంగా హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మూవీ కూడా కంఫర్మ్ అయింది.
ఈ తరుణంలో ఎన్టీఆర్ మరో చిత్రానికి తన అంగీకారం తెలిపినట్లు ఒక రూమర్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేసిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ అని అంటున్నారు.
శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ అతడి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్ కి రాహుల్ ఒక పీరియాడిక్ కథని వివరించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని సమాచారం. పూర్తిగా స్క్రిప్ట్ ఫినిష్ చేయమని ఎన్టీఆర్.. రాహుల్ ని కోరాడట.
అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఎన్టీఆర్ ఒకే చెప్పినా తాను ముందుగా కమిటైన చిత్రాలని పూర్తి చేసిన తర్వాతే ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు. ఈ రూమర్ నిజమైతే రాహుల్ జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ రూమర్ పై పూర్తి క్లారిటీ రానుంది.