అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ జనాలకు దగ్గరైన రాహుల్ రవీంద్రన్ ఊహించని విధంగా డైరెక్షన్ వైపు అడుగులు వేశాడు. మొదటి సినిమా చిలసౌ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో వెంటనే నాగార్జున మన్మథుడు2 సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 

మొదట పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నాగార్జున సినిమాలో రొమాన్స్ డోస్ ఎక్కువవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేకపోయారు. దీంతో నెక్స్ట్ ఎలాగైనా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఓ సినిమా చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సితారా ఎంటర్టైనమెంట్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

చిలసౌ సినిమా తరువాత ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాహుల్ కి అడ్వాన్స్ ఇచ్చి తమ బ్యానర్ లో ఒక సినిమా చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక రాహుల్ నెక్స్ట్ ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందుబాటులో నాగ చైతన్య - నాని లాంటి హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఇద్దరిలో ఓవరినో ఒకరిని కథానాయకుడిగా ఎంచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.