టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కొత్త కమెడియన్స్ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని తనదైన బాషా తీరుతో అర్జున్ రెడ్డి ద్వారా క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత అతనికి మరికొన్ని మంచి ఆఫర్స్ వచ్చాయి. 

ఇకపోతే ఎవరు ఊహించని విధంగా ఈ యువ నటుడు ఇటీవల ఒక రొమాంటిక్ పిక్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అందులో సముద్రం ఒడ్డున సంధ్యా సమయంలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా ఒక స్పెషల్ విషయాన్నీ కూడా చెప్పాడు. 

జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడంతో రామకృష్ణకు ఫాలోవర్స్ విషెస్ అందిస్తున్నారు. ప్రస్తుతం మిఠాయి అనే సినిమాలో ఈ కమెడియన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.