రైలు ప్రమాదంపై అలా ట్వీట్.. నటుడు రాహుల్ రామకృష్ణపై నెటిజన్లు ఫైర్.. వెంటనే సారీ చెబుతూ..
ఒడిశాలో ట్రైన్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. నెటిజన్లు ఆయన తీరును తప్పుబట్టారు. వెంటనే రాహుల్ స్పందించారు.
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, మరో రెండు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 300 వరకు ప్రయాణికులు మృతి చెందడం బాధాకరం. 500కు పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ యాక్సిడెంట్ పై దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చింతించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో Rahul Ramakrishna చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. రాహుల్ ఘటనపై అవగాహన లేకపోవడంతో ‘సైలెంట్’ అనే హాలీవుడ్ సినిమాలో రైలు ముందు నటుడు బస్టర్ కీటన్ చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రాహుల్ తీరుపై మండిపడ్డారు. ట్రైన్ యాక్సిడెంట్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే మీకు కామెడీగా ఉందా? అంటూ విమర్శలు గుప్పించారు.
తప్పు తెలుసుకున్న రాహుల్ వెంటనే ఆ వీడియోను డిటీల్ చేశారు. తనకు నిజంగా ఘటనపై ఐడియా లేదంటూ క్షమాణలు కోరారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. ‘ఇంతముందు పెట్టిన ట్వీట్ కు క్షమాపణలు కోరుతున్నాను. ఆ విషాద ఘటన గురించి నాకు తెలియదు. నిన్న అర్థరాత్రి నుంచి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నారు. దాంలో వార్తలు చూడలేదు. అందుకే అలా జరిగింది. మరోసారి క్షమాపణలు కోరుతున్నాను‘ అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ‘మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని విమర్శించాలని కాదు.. మీకు ఆ ఘటనపై సమాచారం ఇవ్వాలనుకున్నాను‘. అని ట్వీట్ చేశాడు. ఇందుకు రాహుల్ రిప్లై ఇస్తూ ‘నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్‘ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషీ’లో కీలక పాత్రలో అలరించబోతున్నారు. సెప్టెంబర్ 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.