డ్రగ్స్ ఆరోపణపై అరెస్ట్ కాబడిన హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిల విచారణ కొనసాగుతుంది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ బెంగుళూరులోని పరపన్న అగ్రహారం జైలులో ఉంచి విచారణ జరుపుతున్నారు. రాగిణి, సంజనా భారీగా సొమ్ము కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సంజనాకు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలలో 40 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఐతే సంజనా అరెస్ట్ కి ముందు ఆమె ఖాతాల నుండి భారీగా నగదు బదిలీ చేయబడినట్లు తెలుస్తుంది. 

రాగిణి  కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు తమ విచారణలో కనుగొన్నట్లుగా సమాచారం అందుతుంది. సంజనా ఓ ప్రముఖ గోల్డ్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారట. ఇంత పెద్ద మొత్తంలో ఎలా సంపాదించారని అధికారులు అడగడం జరిగింది. ఐతే తమ సంపాదన అంతా సక్రమ మార్గంలో వచ్చినదే అని వీరు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. తాము ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని, సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ మరియు వ్యాపార ప్రకటనల ద్వారా తాము నగదు కూడబెట్టినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. 

ఐతే అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వీరు అస్పష్టంగా సమాధానం చెప్పినట్లు, కొన్ని ప్రశ్నలకు తడబడినట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు అనేక మంది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ కాగా మరింత లోతుగా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక వీరిద్దరూ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా కోర్ట్ తిరస్కరించింది.