HanuMan: `రఘునందన` సాంగ్ వచ్చేసింది.. `హనుమాన్` ఫ్యాన్స్ కి పండగే..
సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించిన `హనుమాన్` మూవీ నుంచి అసలైన పాట వచ్చేసింది. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న పాట రానే వచ్చింది.
సంక్రాంతికి విడుదలైన `హనుమాన్` మూవీ సంచలనం సృష్టించింది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న అతి తక్కువ థియేటర్లలో విడుదలై నెమ్మదిగా పుంజుకుంటూ భారీ స్థాయికి చేరుకుంది. చిన్న సినిమాగా వచ్చి అన్నిరికార్డులు బ్రేక్ చేసింది. టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల వరకు వసూలు చేసింది. 150కోట్లకుపైగా షేర్ సాధించింది. కేవలం యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇంతటి పెద్ద సక్సెస్ సాధించడం విశేషమనే చెప్పాలి.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మ్యాజిక్‌తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. 22కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో సంక్రాంతికి విడుదలై ఏకంగా 160కోట్ల షేర్ సాధించింది. నిర్మాతకి వంద కోట్లకుపైగా లాభాలు తెచ్చిపెట్టింది. బయ్యర్ల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు గట్టిగా వెనకేసుకున్నారని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ హవా తగ్గడం లేదు. ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, వీఎఫ్‌ఎక్స్, హనుమంతుడి ఎలిమెంట్లు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. రామాలయం హడావుడి నడుస్తున్న సమయంలో వచ్చిన సినిమా కావడం, క్వాలిటీగా ఉండటం, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు నచ్చేలా ఉండటంతో ఈ మూవీ బాగా ఆదరణ పొందింది.
సినిమాతోపాటు ఇందులోనూ పాటలు బాగా ఆదరణ పొందుతున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. `పూలమ్మె పిల్ల` యూట్యూబ్ రచ్చ చేస్తూనే ఉంది. ఇక తాజాగా `రఘునందన` సాంగ్‌ని విడుదల చేసింది యూనిట్. ఆడియెన్స్ సాంగ్‌ని విడుదల చేశారు. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఇది. సినిమాలో ఈ పాట, ఆయా సన్నివేశాలు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఆడియెన్స్ హృదయాలను ఆకట్టుకున్నాయి.
ఇదే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. హనుమంతుడు హిమాలయ గుహల నుంచి బయటకు రావడం, ఆయన విశ్వరూపం చూపించడం, రాముడికి ఇచ్చిన మాటని నెరవేర్చడం కోసం కార్యోన్ముఖుడు కావడం అనే కాన్సెప్ట్ తో ఈ పాట, హనుమంతుడి సన్నివేశాలు వస్తాయి. అటు ఆంజనేయుడుతోపాటు సినిమాలోని హనుమంతుడు(తేజ సజ్జా) ఎదురుపడే సీన్లు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగాఈ పాటని విడుదల చేసింది యూనట్. దీనికోసం ప్రకటించినప్పట్నుంచి ఆతృతగా ఉన్నారు. తాజాగా పాట రావడంతో యూట్యూబ్ షేక్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 2నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
Read more: Janhvi Kapoor: మరో స్టార్ హీరో సరసన జాన్వీ.. ఏడాదిలోనే లెక్క మార్చేసిన శ్రీదేవి తనయ!