ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ 'మహానటి'. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండస్ట్రీకు చెందిన ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా విడుదలైందని వెల్లడించారు. పెద్ద సినిమా తీశామనే ఆనందం ఒక వైపు ఎలా ఆడుతుందనే భయం మరోవైపు. అదే సమయంలో భారీ వర్షం. ఆ వరద ఎప్పుడు ఆగుతుందనే ఎదురుచూపు. 

ఎట్టకేలకు సాయంత్రం నుండి జనాలు సినిమాకు రావడం మొదలుపెట్టారు. మా దత్(అశ్వనీదత్) గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. అదే రోజున నేడు మహానటి విడుదలైంది. అప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి నిర్మించాలంటే ఎంత ధైర్యం కావాలో ఇప్పుడు మహానటి చేయడానికి కూడా అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్రను తరతరాలకు అందించిన వైజయంతి మూవీస్ కు ధన్యవాదాలు. కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో జీవించింది. దుల్కర్ నటన అద్భుతం, నాగ్ అశ్విన్ కు చిత్రబృందానికి అభినందనలు అని తెలిపారు.