ప్రముఖ డాన్స్ డైరక్టర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన అభిమానులను ముఖ్యంగా. దివ్యాంగులకు, హిజ్రాలను ఉద్దేసించి ఓ రిక్వెస్ట్ చేసారు.
ప్రముఖ డాన్స్ డైరక్టర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన అభిమానులను ముఖ్యంగా. దివ్యాంగులకు, హిజ్రాలను ఉద్దేసించి ఓ రిక్వెస్ట్ చేసారు. తొందర పడవద్దు.. సహనం పాటించండి అని కోరారు. గత కొద్ది రోజులుగా రాఘవ లారెన్స్‌కు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ మేరకు రాఘవలారెన్స్ శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇదీ..
‘కాంచన–3 చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. నాపై ప్రేమాభిమానాలు కలిగిన వారికి ఒక విన్నపం. నా తరుపున కొందరు దివ్యాంగులు, హిజ్రాలు, పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కొందరిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అలాంటిదేమీ చేయకండి. సహనాన్ని పాఠించండి. మనం మంచినే కోరుకుందాం. మంచినే చేద్దాం.వారిని వారి ఇష్టానికే వదిలేద్దాం. నాకు చిన్న సమస్య అని తెలియగానే పరిగెత్తుకొచ్చే మీ అందరికీ నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రస్తుతం నేను ముంబైలో కాంచన చిత్ర హిందీ రీమేక్ షూటింగ్‌లో ఉన్నాను. షూటింగ్ పూర్తి కాగానే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. భగవంతుడు మనకి మంచే చేస్తాడు. మనకు చెడు జరగాలని భావించేవారికీ మంచే జరగాలని మనం దేవుని ప్రార్థిద్దాం. మన గురించి అర్థం చేసుకునేలా వారికి ఆ భగవంతుడి కృప కలగడం’ అని పేర్కొన్నారు.
ఇక రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3. ఈ చిత్రం రివ్యూలు యావరేజ్ గా వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుంచీ అంచనాలను మించి వసూళ్ళ పరంగా భీభత్సం సృష్టిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు భాషల్లోను సేట్ టాక్..కలెక్షన్స్ టాప్ అన్నట్లుగా తన హవా చూపిస్తోంది. మాస్‌కు విపరీతంగా ఎక్కేయటంతో.. ఈ సినిమాకు బి, సి సెంటర్స్ లో హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 27, 2019, 11:05 AM IST