Rajinikanth:రజనీకు విలన్ గా ఆ స్టార్ నే ఫైనల్? , వాటే స్ట్రాటజీ
రజినీ సినిమాలో ఏ పాత్ర చేయడానికైనా రెడీ అంటూ ఈ పాత్ర గురించి చెప్పగానే తను ఓకే చెప్పారట.
తమిళ సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ కు హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తను నటించే సినిమాల్లో రజనీని అనుకరించే లారెన్స్ ఇప్పుడు ఏకంగా ఆయన సినిమాల్లోనే నటిస్తున్నారు. రజనీ సినిమాలోనే ఆయన విలన్ గా చేయబోతున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. ఫస్ట్ టైమ్ ఇలా ఓ పూర్తి స్దాయి విలన్ గా కనిపించటం , అదీ రజనీ వంటి సూపర్ స్టార్ కు కావటం విశేషం. లారెన్స్ తన డాన్స్ లు, రగ్గెడ్ క్యారక్టర్స్ తో మాస్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన డార్క్ సైడ్ ని రజనీ సినిమాలో చూపించనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే...
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్... ‘తలైవర్ 171’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోనే ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. నిజానికి రజనీకాంత్ కు లారెన్స్ వీరాభిమాని. ఆయనతో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరబోతోంది. లోకేష్ కనగరాజ్, రజినీ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ చేయబోతున్నారట. రజినీ సినిమాలో ఏ పాత్ర చేయడానికైనా రెడీ అన్నారట లారెన్స్. సినిమా పాత్ర గురించి చెప్పగానే తను ఓకే చెప్పారట.
ఇక లారెన్స్ తమ సినిమాలో చేస్తున్నాడంటూ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, కోలీవుడ్ పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి లోకేష్ సినిమాల్లో హీరోలు విలన్స్ గా నటించడం రొటీన్ విషయమే. ఇప్పటి ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాల్లోనూ హీరోలు ...విలన్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా ఈ లిస్టులో లారెన్స్ కూడా చేరబోతున్నారనే వార్తలు వినిపించడంతో సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ ఎలా కనిపిస్తారోనని ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక లోకేష్ ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కవుట్ అయ్యింది. అటు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’తో డిజాస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ‘జిగర్తాండ’ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.