రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2011లో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన కాంచన ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు - తమిళ్ లో ఊహించని లాభాలని అందించిన ఈ బాక్స్ ఆఫీస్ హిట్ సినిమా బాలీవుడ్ క్లో లక్ష్మి బాంబ్ గా పేలడానికి సిద్ధమవుతోంది. 

అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కు కథ ఒరిజినల్ దర్శకుడు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా అగిపాయిందని రిలీజ్ డేట్ పై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది 2020 మే 22న వరల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 

ఇక సినిమాలో చాలా వరకు స్క్రీన్ ప్లే మారనున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు మేకింగ్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినిమాలో లారెన్స్ చేసిన పాత్రలో అక్షయ్ కుమార్ ఎలా నటిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అయితే అక్షయ్ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తనదైన శైలిలో లీడ్ రోల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్. మరి ఆ అవతారం ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.