చంద్రముఖి రిలీజ్ అయిన 18 ఏళ్ళకు ఈమూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా తమిళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ కొరియో గ్రఫర్ రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈమూవీ గురించి సూపర్ అప్ డేట్ వచ్చింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో.. ప్రభు,నయనతార, జ్యోతిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా చంద్రముఖి. 2004 తో రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలనంగా మారింది. తమిళ,తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆతరువాత ఈసినిమాకు సీక్వెల్ చేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. రజనీకాంత్ కూడా ఈసినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇకఇన్నాళ్లకు .. అంటే చంద్రముఖి రిలీజ్ అయిన 18 ఏళ్ళకు ఈమూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా తమిళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ కొరియో గ్రఫర్ రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోంది.
చంద్రముఖి 2 షూటింగ్ కు ముందు రాఘవ లారెన్స్, వాసు రజినీకాంత్ వద్దకు వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇక చంద్రముఖి 2లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించనుంది.ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి వాసు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ ఎందుకనో రజనీ ఒప్పుకోలేదు. దాంతో ఆయన అనుమతిని తీసుకునే, లారెన్స్ తో సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.
ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. కంగనా రనౌత్ .. మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, వడివేలు.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. . ఈ సారి ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. టీమ్. త్వరలో ఈసినిమా నుంచి సాలిడ్ ప్రమోషన్ వీడియో రిలీజ్ చేయాలని చూస్తుననారు.
