Asianet News TeluguAsianet News Telugu

Prema Entha Madhuram: మాన్సీకి కోలుకోలేని షాకిచ్చిన ఆర్య.. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రాగసుధ!

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Raghasudha re entry in arya vardhans life in todays prema entha madhuram serial gnr
Author
First Published Mar 27, 2023, 10:31 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో నీరజ్ చెప్పినట్లుగానే 15 నిమిషాల్లో అక్కడికి కలెక్టర్ వస్తాడు. ఇక్కడ స్లాబ్ కూల్చటానికి వీల్లేదు అంటాడు అతని పిఏ. ఇక్కడ కల్తీ జరిగింది అంటాడు ఆఫీసర్. బిల్డింగు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి మెటీరియల్ పర్ఫెక్ట్ గా ఉందన్న సర్టిఫికెట్ ని లాస్ట్ మంతే వాళ్ళు మాకు సబ్మిట్ చేశారు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటాడు కలెక్టర్ పిఏ.

కానీ నాసిరకం మెటీరియల్ వల్లే బిల్డింగు కూలిపోయింది అంటాడు ఆఫీసర్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య బిల్డింగు కూలిపోయింది నాసిరకం మెటీరియల్ వల్ల కాదు అంటూ ఒక వర్కర్ ని పిలుస్తాడు. నిజమేనండి బిల్డింగు కూలిపోయింది.. నాసిరకం మెటీరియల్ వల్ల కాదు బిల్డింగ్ నిలబెట్టడానికి పెట్టిన కర్ర ని ఎవరో తీసేశారు. అది చెబుదామని వచ్చే లోపల బిల్డింగు కూలిపోయింది అంటాడు ఆ వర్కర్.

ల్యాండ్ కూడా గవర్నమెంట్ ది ఆక్రమించి కన్స్ట్రక్షన్ బేస్ వేశారు అంటాడు ఆఫీసర్. ఆ ప్లేస్లో కట్టబోయే గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ కాంట్రాక్ట్ కూడా వీళ్లే తీసుకున్నారని చెప్తాడు కలెక్టర్. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తాడు కలెక్టర్ పిఏ. ఆ ఆఫీసర్ అంజలికి, ఆర్యకి సారి చెప్తాడు. వాళ్లకి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది అని ఆఫీసర్ కి చెప్పి ఇక మీ పనికి ఏ అడ్డు ఉండదు అని అంజలి కి చెప్పి  అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కలెక్టర్.

యు ర్ జస్ట్ అమేజింగ్ నీకు సాధ్యం కానిది ఏదీ లేదు అంటుంది అంజలి. నేను చేయవలసిన పని చేశాను ఇక బయలుదేరుతాను అంటాడు ఆర్య. నువ్వు లేకుండా ప్రాజెక్ట్ ఎలా అంటుంది అంజలి. కానీ నాకు కావలసిన నమ్మకం ఇక్కడ దొరకలేదు అంటాడు ఆర్య. అంతలోనే వర్కర్స్ అందరూ వచ్చి చెప్పుడు మాటలు విని ఇలా నడుచుకున్నాము క్షమించండి అంటూ ఆర్య కాళ్ళ మీద పడతారు.

మాతోనే ఉండాలి అంటూ రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అందుకు ఒప్పుకుంటాడు ఆర్య. మిమ్మల్ని వెళ్ళగొట్టిన చేతులతోనే మీకు ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వర్కర్స్. ఇదంతా ఎవరు చేశారు అంటుంది అంజలి. ఎవరు చేశారో తొందరలోనే బయట పెడతాను, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్తాను ఇట్స్ మై ప్రామిస్ అంటాడు ఆర్య. ఆ మాటలకి కంగారుపడుతుంది మాన్సీ. ఆర్య కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది అంజలి.

కారులో ఆలోచనలో ఉన్న అంజలిని ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ప్రీతి. నాకెందుకో ఆనంద్ కామన్ మెన్ కాదేమో అనిపిస్తుంది. అతని వే ఆఫ్ థింకింగ్ అతని ఇంటిలిజెన్సీ చూస్తే అతను ఆర్డినరీ ఆనంద్ కాదనిపిస్తుంది అంటుంది. ఈవిడకి ఇప్పుడు బల్బు వెలిగినట్లుగా ఉంది ఆయన ఆర్డినర్ ఏంటి ఎక్స్ట్రార్డినరీ  బిజినెస్మేన్ అనుకుంటుంది ప్రీతి.

మరో వైపు భార్యని చలివిడి చేశావా, బుజ్జమ్మ రెడీ అయిందా అంటూ కంగారు పడతాడు సుబ్బు. పిలిచిందే చలివిడి కార్యక్రమానికి చేయకుండా ఎలా ఉంటాను అంటుంది పద్దు. అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య కి థాంక్స్ చెప్తాడు సుబ్బు. ఎందుకు అంటాడు ఆర్య. పిలవగానే మా అమ్మాయిని తీసుకువచ్చినందుకు అంటాడు సుబ్బు.

ఆ మాత్రానికే థాంక్స్ ఎందుకు అనుకి కూడా మీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా అందుకే తీసుకొచ్చాను అంటాడు ఆర్య. ఫంక్షన్ కోసం స్వీట్లు తెమ్మని భర్తని పంపించి తను పూలు తేవడానికి వెళుతుంది పద్దు. మా శ్రీవారు చాలా మంచివారు నన్ను, నా మనసుని బాగా అర్థం చేసుకున్నారు అంటుంది అను. ఈ విషయం ఇప్పుడు అర్థమైందా శ్రీమతి గారు అంటాడు ఆర్య.

ఎప్పుడో అర్థమైంది అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటుంది అను. మరోవైపు రాగసుధ ఫోన్ చేయడంతో చాలా రోజులకి గుర్తు చేసుకున్నావు అంటుంది మాన్సీ. నీ తోటి కోడలికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదు,  నేను నీలాగా పంతాన్ని గాలికి వదిలేయను అంటుంది రాగసుధ. ఏం చేసేది వాళ్ళని ఇంట్లోంచి పంపించేసినా కూడా మా వాళ్ళ బుర్రలోంచి పంపించలేకపోతున్నాను అంటుంది మాన్సీ.

ఇకపై నీకు ఆ కష్టం ఉండదు ఎందుకంటే వచ్చేవి అష్టమి ఘడియలు అంటుంది రాగసుధ. నువ్వు ఎలాగూ చలివిడి ఫంక్షన్ కి వెళ్తావు కదా అక్కడ  అనుకి భయాన్ని కలిగించు. అప్పుడు వచ్చేవి అష్టమి ఘడియలు కాబట్టి రాజనందిని ఆమెని ఆవహిస్తుంది. అను ఆవేశానికి లోనైతే బీపీ పెరగవచ్చు ఆవేశం ఎక్కువైతే కడుపులో బిడ్డ పోయినా పోవచ్చు అంటుంది రాగసుధ.

ఐడియా బానే ఉంది కానీ నేను ఒక్కదాన్నే ఈ పని చేయలేను అంటుంది మాన్సీ. నీకేమీ భయం లేదు నేను కూడా ముత్తయిదువల్లో కలిసిపోయి వస్తాను. అక్కడ కలుద్దాము రాజనందిని అనుని అను కడుపులో బిడ్డని బలి తీసుకోవటాన్ని కళ్ళారా చూద్దాము అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాగసుధ. మరోవైపు ముభావంగా ఉన్న పద్దు దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు సుబ్బు.

పొరపాటు జరిగిపోయింది ఈ కార్యక్రమం పొద్దున్నే జరిపించి ఉండాల్సింది కాసేపట్లో అష్టమి ఘడియలు వచ్చేస్తాయి అంటూ కంగారుపడుతుంది పద్దు. అలా ఎలా పొరపాటు పడ్డావు అయినా అందర్నీ పిలిచేశాక ఫంక్షన్ ఆపితే బాగోదు దేవుడి మీద భారం వేసి ముందు పూజ కానిద్దాము అని భార్యకి చెప్తాడు సుబ్బు. శారదమ్మ కూడా ఫంక్షన్ కి వచ్చి అనుని దీవిస్తుంది. డెలివరీ టైం దగ్గర పడింది ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. నేను తనని ప్రశాంతంగా ఉండనిస్తే కదా అనుకుంటుంది మాన్సీ. రాగసుధ వచ్చేస్తుంది ఎలాగైనా బ్రో ఇన్ లా ని  ఇక్కడి నుంచి సైడ్ చేసేయాలి అనుకుంటుంది మాన్సీ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios