బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గోవా బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన రాధిక మరోమారు ట్రోల్ అయింది. ఈ విషయమై ఓ పత్రికతో రాధిక మాట్లాడుతూ.. తనే ఎందుకు ట్రోల్ అవుతున్నానో తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఇది చాలా హాస్యాస్పదమని, బీచ్‌లో కూడా తాను చీర కట్టుకుని తిరగాలని వారు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

 

తనను విమర్శిస్తున్న వారెవరో తనకు తెలియదని, అటువంటప్పుడు తానెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించింది. ప్యాడ్‌మ్యాన్ సినిమాలో తన నటనకు సంబంధించి వస్తున్న రివ్యూలను ఇప్పటి వరకు చదవలేదని పేర్కొంది. అయితే తన నటన ప్రేక్షకులకు నచ్చిందన్న విషయం తెలుసని పేర్కొంది.