తమిళ నడిగర్ సంఘం ఎన్నకలు దగ్గర పడడంతో మళ్లీ ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగారు. గతంలో సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని నటులు శరత్ కుమార్, రాధారవిపై గత ఎనికల్లో విశాల్ ఆరోపణలు చేశారు.

ఇప్పుడు మరోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా శరత్ కుమార్, రాధారవిలను టార్గెట్ చేస్తూ ఓ వీడియో రూపొందించారు. ఇది చూసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. విశాల్ పై మండిపడింది. అతడిని దూషిస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ రాసి షేర్ చేసింది.

తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం నీతిమాలిన పని అని, ఇప్పటికైనా క్లాస్ గా ప్రవర్తించడం నేర్చుకోవాలని పెద్ద క్లాస్ తీసుకుంది. తాజాగా శరత్ కుమార్ భార్య రాధిక కూడా విశాల్ పై మండిపడింది. శరత్ కుమార్ పై చేస్తోన్న ఆరోపణల్లో నిజం ఉంటే రుజువు చేయాలని, పదే పదే అబద్ధాలను ఇతరులపై రుద్దుతూ వారి ప్రతిష్టతకు భంగం కలిగించొద్దని సోషల్ మీడియాలో ఓ లేఖ రూపంలో తెలిపింది.

శరత్ కుమార్ ని అవినీతి ఆరోపణల్లోకి లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. కోశాధికారి కార్తి, అధ్యక్షుడు నాజర్ లపై ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. సంఘంలోని నేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే.. నడిగర్ సంఘానికి, నటీనటులకు మంచిది కాదని అన్నారు. మరి దీనిపై విశాల్ స్పందిస్తాడేమో చూడాలి!