రాధికా ఆప్టే.. `రక్త చరిత్ర` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత బాలకృష్ణతో `లెజెండ్‌`, `లయన్‌` చిత్రాల్లో మెరిసింది. `లయన్‌` ఫెయిల్‌ కావడంతో ఇక
టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పిన ఈ అమ్మడు బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు కాకుండా విభిన్న కథా నేపథ్యంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ
ఆకట్టుకుంటోంది. ఎక్కువగా పారలల్‌ సినిమాలను ప్రోత్సహిస్తుంది. ఆ మధ్య `ఆహల్య` అనే లఘు చిత్రంతో పాపులర్‌ అయిన ఈ హాట్‌ భామ తాజాగా బాలీవుడ్‌కి సంబంధించి
పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాలీవుడ్‌కి సంబంధించి ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను పుణె నుంచి సినిమా అవకాశాల కోసం ముంబయికి
వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మంది తనని అడ్డుకున్నారని తెలిపింది. సినిమాలపై తనకు చెడుగా చెప్పారన్నారు. అక్కడికి వెళ్తే అత్యాచారం చేస్తారన్నారు. బాలీవుడ్‌లో ఇదే
ఎక్కువగా జరుగుతుందని చెప్పారు. బాలీవుడ్‌లో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదని తెలిపింది. 

 ఇంకా చెబుతూ, జనాలు నెగటివ్‌ విషయాలనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తారని, అసలు సమస్య మనలో ఉందని అంటోంది రాధికా. మనం కేవలం బాలీవుడ్‌లో జరిగే దాని గురించే
మాట్లాడుకుంటామని, కానీ మనమంతా మనుషులమే అనే విషయాన్నిఅర్థం చేసుకోవాలని తెలిపింది. తాను కూడా అందరిలాంటి మనిషినే అని, అందరివి సాధారణ
జీవితాలుగానే చూడాలని వెల్లడించింది. ఇక రాధికా నటించిన `రాత్‌ ఆకేలీ హై` చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంది.