ఇండియన్‌ సంస్కృతికి వ్యతిరేకంగా ఉందంటూ `బైకాట్‌ రాధికా ఆప్టే` అని ట్రెండ్‌ చేశారు. దీంతో మరింతగా రాధికగా ఇబ్బంది పెడుతుంది. ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ వీడియోలో రాధికా ఆప్టేతో కలిసి నటించిన నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ స్పందించాడు. 

రాధికా ఆప్టే ఇటీవల మరోసారి ట్రోల్‌కి గురైన విషయం తెలిసిందే. `పార్చడ్‌` సినిమాలోని న్యూడ్‌ వీడియోని కొందరు ట్రోలర్స్ దాన్ని మరోసారి ట్రోల్‌ చేశారు. ఇది ఇండియన్‌ సంస్కృతికి వ్యతిరేకంగా ఉందంటూ `బైకాట్‌ రాధికా ఆప్టే` అని ట్రెండ్‌ చేశారు. దీంతో మరింతగా రాధికగా ఇబ్బంది పెడుతుంది. ఇది బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ వీడియోలో రాధికా ఆప్టేతో కలిసి నటించిన నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ స్పందించాడు. ఆమెకి మద్దతుగా నిలిచాడు. 

ఓ ఇంటర్వ్యూలో ఆదిల్‌ మాట్లాడుతూ, రాధికాని బహిష్కరించాలంటూ ట్రోల్స్‌ చేయడం హాస్యాస్పదమని తెలిపారు. `నేను కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని చూశా. రాధికని అందులో ట్రోల్ చేయడం హాస్యాస్పదంగా అనిపించింది. బేసిక్‌గా ఇలాంటి వాటిపై నేను పెద్దగా పట్టించుకోను. దానికి ప్రతిస్పందించడం ఏకైక మార్గం అని నేను అనుకోను. స్పందిచాలనుకోను. 

తనకు, రాధికకి మధ్య ఉన్న సన్నివేశాన్ని ట్రోల్‌ చేస్తున్న వ్యక్తులకు కళ గురించి పోర్న్ కి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు. వాళ్లు అర్థం చేసుకోలేరు. నిజానికి ఆర్ట్ ఇప్పటికీ ప్రశ్నించబడుతుంది. ఇలా ట్రోల్‌ చేసే వాళ్లంతా స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌, స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్ కి వెళ్లాలని తెలిపారు. 

ఇదే విషయంపై గతంలో రాధికా ఆప్టే స్పందిస్తూ, ఇలాంటి సన్నివేశాలు చేయడం ఈజీ కాదు. ఆ సమయంలో నేను నా సొంత బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్యలతో బాదపడుతున్నా. తెరపై న్యూడ్‌గా అంటే కొంచెం భయంగా అనిపించింది. ఇప్పుడు మాత్రం నేను ఏదైనా భరించగలను. నా శరీర ఆకారం, పరిమాణం గురించి నేను గర్వపడుతున్నా. నాకు నిజంగా ఇలాంటి పాత్రలు అవసరం` అని తెలిపింది.

టాలీవుడ్‌లో `రక్తచరిత్ర`,`లెజెండ్‌`, `లయన్` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరైన రాధికా ఆప్టే ప్రస్తుతం `మోనికా,ఓ మై డార్లింగ్‌` చిత్రంలో నటిస్తుంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా, డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రాధికా.