మంచంలో నాకు ఆ యాంగిల్ అంటే ఇష్టం : రాధిక ఆప్టే

Radhika apte loves it alone in bed
Highlights

మంచంలో నాకు ఆ యాంగిల్ అంటే ఇష్టం

రాధికా ఆప్టే కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతుందో లేదా ఈమె ఏం మాట్లాడినా అది వివాదం అయిపోతుందో తెలీదు కానీ రాధిక ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఈ మధ్యనే నేహా ధూపియా షో కి వచ్చిన ఈ తార హోస్ట్ అడిగిన ఘాటు ప్రశ్నకి ఫన్నీ గా సమధానమిచ్చి తప్పించుకుంది.

వచ్చిన గెస్ట్ ఎవరైనా వాళ్ళని తన ప్రశ్నలతో చల్లగా కూపీ లాగడంలో నేహా ధూపియా దిట్ట. ఇప్పటికే ఈమె షో కి విచ్చేసిన చాలా మంది సెలెబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కున్నారు. వారి లిస్ట్ లో జాయిన్ అవ్వకుండా రాధిక తెలివిగా తప్పుకుంది. షో లో ఈ లెజెండ్ బ్యూటీ ఎదురుకున్న ప్రశ్నలలో 'మంచంలో మీకు ఇష్టమైన పొజిషన్ ఏంటి?' అని. నిజానికి ఇది నేహా షో కి వచ్చిన అందరినీ అడిగే ప్రశ్నే. ఎదో చెప్పి ఇబ్బందులో ఇరుక్కోకుండా అలా అని ఎక్కువ ఆలోచించకుండా టక్కున తన సమాధానంతో అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

"ఆఫ్ కోర్స్.. నేను ఒక్క దాన్నే పడుకున్నప్పుడు.. మరెవరితోనో పడుకున్నప్పుడు అని మీరు అడగలేదుగా" అంటూ చమత్కరించింది. టాలీవుడ్లో పెద్దగా కనపడకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీగా ఉంది. మొన్ననే అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ సినిమాలో నటించిన రాధిక సైఫ్ అలీ ఖాన్ సరసన బజార్ సినిమాలో కనిపించనుంది. 

loader