సౌత్ హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. అరుదైన ఛాలెంజిగ్ పాత్రలను ఎంచుకునే షాకిచ్చే అమ్మడు ఇటీవల ఊహించని విధంగా రొమాంటిక్ సీన్స్ పై వివరణ ఇచ్చింది. ఆ కామెంట్స్ కాస్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

రొమాంటిక్ సీన్ లో నటిస్తే ఫీలింగ్స్ రావా అన్న ప్రశ్నకు అమ్మడు తడబడకుండా ఆన్సర్ ఇచ్చింది. ఫీలింగ్స్ రావడం అనేది చాలా సహజం.. చాలా సందర్భాల్లో నాకు ఫీలింగ్స్ కలిగాయి. నటనలో భాగమే అని ఎదో పైకి నటించలేం.. ఫీల్ అయితేనే పాత్రకు న్యాయం చేయగలం. రొమాంటిక్ గా ఫీల్ అవ్వాల్సిందే అని తెలిపింది. 

అదే విధంగా ఎప్పుడైనా ఎవరితో ప్రేమలో పడ్డారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. షూటింగ్ సమయంలో చాలా మంది నన్ను ఆకర్షించారు. అందులో కొంతమంది నా మనసుకు నచ్చారు. అప్పుడు వారితో ప్రేమలో పడినట్లు రాధిక సమాధానమిచ్చింది.